నా ఇల్లు సక్కపెట్టేవాడు ఎవడైతే నాకేంటి..? హీరో రామ్

Published : Jan 30, 2019, 10:36 AM IST
నా ఇల్లు సక్కపెట్టేవాడు ఎవడైతే నాకేంటి..? హీరో రామ్

సారాంశం

ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడుపై హీరో రామ్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడుపై హీరో రామ్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మంగళవారం అనంతపురం జిల్లా ఎర్రమంచిలో కియా కార్ల సంస్థలో ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభించిన సంగతి తెలిసిందే. కియా కంపెనీ నుంచి తొలి కారును విడుదల చేశారు. ఆ కారును చంద్రబాబు టెస్ట్ డ్రైవ్ కూడా చేశారు.

కాగా.. దీనిపై  చంద్రబాబు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.. ‘‘ కొన్ని సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వస్తాయంటే ఎవరూ నమ్మలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషితో జిల్లాకు నీటి సరఫరా అందించాం. దీని ద్వారా జిల్లాలో మరెన్నో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

కాగా.. చంద్రబాబు ట్వీట్ కి హీరో రామ్ స్పందించారు.  ‘ఇది నిజమే.. మన రాష్ట్రానికి ఇది భారీ ముందడుగు. మున్ముందు ఇలాంటివి మరెన్నో వస్తాయి’ అని పేర్కొన్నారు. 

రామ్ చేసిన ఈ ట్వీట్ కి నెటిజన్లు ఫిదా అయిపోయారు.  తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మద్దతు తెలుపుతున్న ఏకైక హీరో రామ్‌ అంటూ నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. 

ఈ కామెంట్లపై రామ్‌ స్పందిస్తూ.. ‘నా ఇల్లు సక్కపెట్టేటోడు ఎవరైతే నాకేంటి అన్నాయ్‌.. నువ్వు మంచి చెయ్‌.. నీకూ ఇస్తా ఓ ట్వీటు. ఆంధ్రా నాదే, తెలంగాణ నాదే. ఇదే మాట మీదుంటా. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అస్సల్లేదు. ముందు నేను పౌరుడిని ఆ తర్వాతే నటుడ్ని’ అని వెల్లడించారు రామ్‌.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం