హెరిటేజ్ లో రూ. 22 వేలు: రైతుల వద్ద రూ. 2 వేలా

Published : May 04, 2017, 11:05 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
హెరిటేజ్ లో రూ. 22 వేలు: రైతుల వద్ద రూ. 2 వేలా

సారాంశం

స్టోర్లలోనూ వేల రూపాయలు పలుకుతున్న మిర్చి ధర మార్కెట్ యార్డుల్లో మాత్రం క్వింటాలుకు రూ. 2500 మాత్రమే. అంటే కష్టపడి మిర్చిని పండించే రైతన్నకు దక్కేది మాత్రం శూన్యం. అదే దళారీలకు, పెద్ద పెద్ద స్టోర్లకు మాత్రం రూ. 25-35 వేల మధ్య.

క్వింటాల్ ఎండుమిర్చి హెరిటేజ్ ఫ్రెష్ లో రూ. 22 వేలా? రిలయన్స్ లో రూ. 35 వేలా? హెరిటేజ్ అన్నా రిలయన్స్ ఫ్రెష్ అన్నా అందరికీ తెలిసిందే కదా చంద్రబాబునాయుడు, ముఖేష్ అంబానీల స్టోర్స్ అని.  పై రెండు స్టోర్లలోనూ వేల రూపాయలు పలుకుతున్న మిర్చి ధర మార్కెట్ యార్డుల్లో మాత్రం క్వింటాలుకు రూ. 2500 మాత్రమే. అంటే కష్టపడి మిర్చిని పండించే రైతన్నకు దక్కేది మాత్రం శూన్యం. అదే దళారీలకు, పెద్ద పెద్ద స్టోర్లకు మాత్రం రూ. 25-35 వేల మధ్య. మార్కెట్ మాయాజాలం ఎంత విచిత్రమో కదా?

మిర్చి క్వింటాలుకు మద్దతు ధరను కేంద్రం ప్రకటించిన అమలు కాకపోవటం గమనార్హం. కేంద్ర ప్రకటించిన రేటుకు వ్యాపారస్తులు ఎవరూ కొనటం లేదట. ధరలు పడిపోయినపుడు మాత్రం రైతుల వద్ద వేల క్వింటాళ్ళ లెక్కన కొనుగోలు చేసింది మాత్రం దళారీలే. అంటే, ధర తక్కువుగా ఉన్నపుడు చోద్యం చూస్తున్న ప్రభుత్వాలు రైతుల వద్ద సరుకును దళారీలు కొనుగోలు చేయగానే ఒక్కసారిగా క్వింటాలుకు రూ. 4 వేలు పెంచేయటం విశేషం. దాంతో కడపుమండిన రైతులు ఈరోజు ఉదయం నుండి గుంటూరు మిర్చియార్డు వద్ద ఆందోళనకు దిగారు.

దేశంలో రోజుకు 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వైసీపీ ఎంఎల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. మిర్చి క్వింటాలుకు రూ. 10 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే