మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ..

Published : Dec 27, 2022, 04:53 PM IST
మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ది  శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి థెరీసమ్మ సోమవారం తెల్లవారుజామున మృతిచెందిన సంగతి  తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ది  శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆదిమూలపు సురేష్ మాతృమూర్తి థెరీసమ్మ హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామను కన్నుమూశారు. ఆదిమూలపు సురేష్ తల్లి థెరిసమ్మ భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మంత్రి నివాసానికి తీసుకొచ్చారు. సాయంత్రం స్థానిక జార్జి గ్రీన్స్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం జగన్ ఎర్రగొండపాలెంలోని  మంత్రి ఆదిమూలపు సురేష్‌ నివాసానికి చేరుకున్నారు. ఆదిమూలపు సురేష్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్.. థెరీసమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ తిరుగుపయనమయ్యారు. 

ఇక, థెరీసమ్మ.. టీచర్‌గా పనిచేశారు. ఎందరినో ఉన్నత విద్యావంతులుగా ఆమె తీర్చిదిద్దారు. ఆమె తన భర్త డాక్టర్ ఆదిమూలపు శామ్యూల్ జార్జి విద్యాసంస్థలకు చైర్‌పర్సన్‌గా కొనసాగారు. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో విద్యాభివృద్దిగా ఎంతగానో కృషిచేశారు. 

PREV
click me!

Recommended Stories

Vijay Saireddy New Twist On YS Jagan | Vijaysaireddy Press Meet Today | Asianet News Telugu
ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న Sai Reddy | Vijay Saireddy Press Meet | Asianet News Telugu