బంగాళాఖాతంలో అల్పపీడనం:ఏపీలో మరో రెండురోజులపాటు భారీ వర్షాలు

By narsimha lodeFirst Published Nov 14, 2022, 9:35 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో  వర్షాలు కురుస్తున్నాయి.


అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే  రెండు  రోజుల  పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది..ఇప్పటికే నెల్లూరు,చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ శాఖాధికారులు హెచ్చరించార. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని  వాతావరణ శాఖ సూచించింది. రెండు రోజులుగా రాష్ట్రంలోని నెల్లూరు,చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.ఈ వర్షాల కారణంగా లోతట్టు  ప్రాంతాలు జలమయమయ్యాయి. తమిళనాడు రాష్ట్రానికి సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా  రెండు  రోజుల పాటు వర్షాలు కురిసే  అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ వర్షాల కారణంగా నెల్లూరులోని మాగుంట లేఔట్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి వరద నీరు చేరింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది .గూడూరు సమీపంలో పంబలేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది.తిప్పగుంటపాలెంలో ఉప్పుటేరుకు వరద నీరు పోటెత్తింది..చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు  కురుస్తున్నాయి.ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే  అవకాశం ఉంది..

ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ప్రతి ఏటా ఈశాన్య రుతుపవనాల  ప్రభావంంతో తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయి.ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా నగరంలోని  పలు  ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి.బంగాళకాతంలో ఏర్పడిన  అల్పపీడనం కారణంగా వర్షాలు    కురిసే  అవకాశం  ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

click me!