కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు: పొంగిపోర్లుతున్న వాగులు.. స్తంభించిన రాకపోకలు

Siva Kodati |  
Published : Jun 27, 2021, 03:19 PM IST
కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు: పొంగిపోర్లుతున్న వాగులు.. స్తంభించిన రాకపోకలు

సారాంశం

కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోడుమూరు మండలం వరుకూరు దగ్గర తుమ్మల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో హెచ్‌పీ గ్యాస్ లారీ వాగులో చిక్కుకుపోయింది. లారీ డ్రైవర్‌ను అతి కష్టం మీద తాళ్ల సహాయంతో బయటకు లాగారు స్థానికులు. మరోవైపు కర్నూలు- ఆదోనీ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

మంత్రాలయం మండలం రచ్చమరి దగ్గర భారీ వర్షాలకు వాగులు, వంకలు పోర్లుతున్నాయి. సీడ్ పత్తిపంట, ఉల్లి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. నందవరం-నాగుల దిన్నె మధ్య వాగు ఉద్ధృతి కారణంగా రాకపోకలు అంతరాయం ఏర్పడింది. గోనెగండ్ల మండలం హెచ్ కైరావాడిలో ఇళ్లల్లోకి వర్షపునీరు చేరుకుంది. ఎమ్మిగనూరులో ముకతిపేట, లక్ష్మీనగర్, శివన్ననగర్ , వీవర్స్ కాలనీలోకి వర్షపు నీరు చేరి మగ్గాలు తడిశాయి. దీంతో చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. నందవరంలో ఎస్సీ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. 
 

PREV
click me!

Recommended Stories

సైకిల్ పార్టీనా, సైకో పార్టీనా? ఆర్కే రోజా సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Ambati Rambabu Comments: సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు | Asianet News Telugu