గుంటూరు గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకొంది. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కృష్ణ తన స్నేహితుడికి ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
గుంటూరు: గుంటూరు గ్యాంగ్ రేప్ కేసులో కీలక మలుపు చోటు చేసుకొంది. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కృష్ణ తన స్నేహితుడికి ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 20వ తేదీన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్ వద్ద ప్రియుడిని తాళ్లతో కట్టేసి ప్రియురాలిపై నిందితులు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇద్దరు అనుమానితులు పరారీలో ఉన్నారు.
కృష్ణ అనే అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణ అనే వ్యక్తి తన స్నేహితుడు రామకృష్ణకు ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. విజయవాడ రాణితోటలో నివాసం ఉంటున్న రామకృష్ణ అనే వ్యక్తికి కృష్ణ ఫోన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.
రామకృష్ణతో కృష్ణ రెండు నిమిషాలు ఫోన్ లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఇద్దరు అనుమానితులు ఈ ఘటన జరిగిన నాటి నుండి పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణ ఫోన్ ట్రాక్ చేస్తున్నారు పోలీసులు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కృష్ణ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.