రానున్న మూడు రోజుల పాటు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు.. : ఐఎండీ

By Mahesh Rajamoni  |  First Published Aug 18, 2023, 2:49 AM IST

Heavy Rains: రానున్న మూడు రోజుల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌నీ, ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రించింది. గురువారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ (ఎన్‌సీఎపీ), యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.
 


Andhra Pradesh Rains: రానున్న మూడు రోజుల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మోస్తారు వ‌ర్షాలు కురుస్తాయ‌నీ, ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) హెచ్చ‌రించింది. గురువారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ (ఎన్‌సీఎపీ), యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.

వివ‌రాల్లోకెళ్తే..  ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ల్లో వాన‌లు పడేందుకు వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలంగా మారుతున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. వచ్చే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి కొమోరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి తెలిపారు.

Latest Videos

undefined

 గురువారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ (ఎన్‌సీఎపీ), యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. అదేవిధంగా, శుక్ర, శనివారాల్లో NCAP, యానాంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందనీ, అదే భౌగోళిక ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వ‌ర్షాలు సైతం ప‌డే అవ‌కాశముంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఆదివారం  కూడా ఎన్‌పీఏపీ, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెద‌ర్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది.

కాగా, తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా శుక్రవారం హైదరాబాద్ సహా పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. చలి గాలులు వీస్తున్నాయని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి.

click me!