Chandrababu Naidu: ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డికి చంద్రబాబు అల్టిమేటం..

By Mahesh Rajamoni  |  First Published Aug 18, 2023, 12:08 AM IST

Konaseema district: వైఎస్ఆర్సీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత‌, రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కొత్తపేట వెళుతూ జొన్నాడ లో ఇసుక డంపింగ్ ప్రాంతాన్ని ప‌రిశీలించిన చంద్ర‌బాబు.. ఇసుక తవ్వకాలపై అక్రమాలను ప్రశ్నిస్తూ.. సీఎం జ‌గ‌న్ కు అల్టిమేటం జారీ చేశారు. 
 


TDP Chief Chandrababu Naidu: వైఎస్ఆర్సీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత‌, రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీవ్ర విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. కొత్తపేట వెళుతూ జొన్నాడ లో ఇసుక డంపింగ్ ప్రాంతాన్ని ప‌రిశీలించిన చంద్ర‌బాబు.. ఇసుక తవ్వకాలపై అక్రమాలను ప్రశ్నిస్తూ.. సీఎం జ‌గ‌న్ కు అల్టిమేటం జారీ చేశారు. 

వివ‌రాల్లోకెళ్తే.. కొత్తపేట వెళుతూ ఆలమూరు మండలం జొన్నాడలో ఇసుక డంపింగ్ ప్రాంతాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైకాపా స‌ర్కారు తీరుపై మండిప‌డుతూ.. ఇసుక తవ్వకాలపై అక్రమాలను ప్రశ్నించారు. ఎటువంటి పత్రాలు లేకుండా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగుతున్న విధానాన్ని, ఇసుక మాఫియా ఆగడాలపై  ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం లో వైసీపీ నేతల ఇసుక దోపిడీ పై ప్రజలు చంద్రబాబుకు వివ‌రించ‌గా, ఇసుక తవ్వకాలపై ఎవరు చేస్తున్నారో చెప్పాల‌నీ,  ప్రభుత్వం కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు, తవ్వకాలు, అమ్మకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Latest Videos

24 గంటల్లో జేపీ వెంచర్‌పై ముఖ్యమంత్రి జగన్ సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఇసుక త‌వ్వ‌కాలు జ‌రుపుతున్న ప్రాంతంలో ఫొటో దిగిన చంద్ర‌బాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. "జొన్నాడలో వైసీపీ నేతల ఇసుక దోపిడీ పై ప్రజలు నాకు ఫిర్యాదు చేసారు. ఒక్క జొన్నాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వింది ఎంత.... అమ్మింది ఎంత.... దోచింది ఎంత? మీరు, మీ నాయకులు మింగింది ఎంత? కాంట్రాక్టర్ మీకు ఇచ్చింది ఎంత? ఖజానాకు వచ్చింది ఎంత? ఒప్పందంలో ఏముంది?  వైట్ పేపర్ ఇవ్వగలరా? ఉచితంగా దక్కాల్సిన ఇసుకను బంగారం చేసింది ఎవరో చెప్పగలరా? ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా?" అని చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శ్నించారు. గోదావరిలో ఒకప్పుడు మత్స్యకారులు ఇసుక తవ్వేవార‌ని చెప్పిన చంద్ర‌బాబు.. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారంటూ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. 

click me!