విజయవాడను ముంచెత్తిన వర్షం: తడిసిముద్దైన జగన్ ప్రమాణ స్వీకార వేదిక

By Nagaraju penumalaFirst Published May 30, 2019, 7:15 AM IST
Highlights

యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. వర్షపు నీటిని బయటకు పంపుతున్నారు. అలాగే పెద్ద పెద్ద ట్రాలీలు రెడీ చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం సమయానికి ఇందిరాగాంధీ స్టేడియంను రెడీ చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ అప్పటికీ స్టేడియం అందుబాటులోకి రాకపోతే బందరు రోడ్డు వేదిక అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో స్టేజ్ కోసం ట్రాలీలను రప్పించారు అధికారులు.  

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వైయస్ జగన్ కు వరుణుడు ఇబ్బందులు సృష్టించాడు. విజయవాడలో అర్థరాత్రి తన ప్రతాపం చూపించాడు. దీంతో బెజవాడ వర్షపు నీటితో నిండిపోయింది. 

ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఇందిరాగాంధీ స్టేడియంలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో
ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేదిక సైతం తడిసిముద్దైంది. 

అంతేకాదు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి తాడేపల్లి వరకు అర్ధరాత్రి వరకు ఎంతో సంబంరంగా అభిమానులు ఏర్పాటు చేసిన హోర్డింగులన్నీ కుప్పకూలిపోయాయి. జగన్ ప్రమాణ స్వీకారానికి మరికొద్ది గంటలు సమయం మాత్రమే ఉండటంతో అధికారులు రంగంలోకి దిగారు. 

click me!