విజయవాడ లో భారీగా హవాలా నగదు, నగలు పట్టివేత

Arun Kumar P   | Asianet News
Published : Jun 04, 2021, 09:20 AM ISTUpdated : Jun 04, 2021, 09:27 AM IST
విజయవాడ లో భారీగా హవాలా నగదు, నగలు పట్టివేత

సారాంశం

అక్రమంగా హవాలా మార్గంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

విజయవాడ నుండి తూర్పుగోదావరి జిల్లాకు తరలిస్తున్న భారీగా హవాలా నగదు, నగలు పట్టుబడ్డాయి. ముగ్గురు వ్యక్తుల నుండి రూ.40 లక్షల నగదు, రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హరిబాబు, బాలాజీ, మణిదీప్ అనే ముగ్గరిని అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.  

విజయవాడలో హవాలా డబ్బు  పట్టుబడటం ఇది మొదటిసారి కాదు. గతేడాది కూడా ఇలాగే  పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుండి  హైద్రాబాద్ కు హవాలా సొమ్ము తరలిస్తున్న ముఠాను  విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురం నుండి స్విఫ్ట్ కారులో హైద్రాబాద్  కు తరలిస్తున్న రూ. 1.49 కోట్ల ఇండియన్ కరెన్సీ, రూ. 24 లక్షలు విలువ చేసే యూఎస్ డాలర్లను పోలీసులు సీజ్ చేశారు.

అదే ఏడాది విజయవాడ పోలీసులు మరో హావాలా రాకెట్ ను పట్టుకొన్నారు. నిందితుల నుండి 1.77 కిలోల బంగారం,40 కిలోల వెండిని స్వాధీనం చేసుకొన్నారు. అంతేకాదు నిందితుల నుండి రూ. 88 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. 

ఇలా విజయవాడ హవాలా వ్యవహారానికి కేంద్రంగా మారుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడ హవాలా  ముఠా కార్యక్రమాలు చేస్తోందా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

 

 


 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్