‘ నా రూమ్ కి వస్తావా..?’ఉపాధ్యాయుడి వేధింపులు.. ఆడియో లీక్..!

Published : Jun 04, 2021, 08:32 AM IST
‘ నా రూమ్ కి వస్తావా..?’ఉపాధ్యాయుడి వేధింపులు.. ఆడియో లీక్..!

సారాంశం

మరో కీచక ఉపాధ్యాయుడు విద్యార్థినిపై కన్నేశాడు. అందుకు సంబంధించిన ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉపాధ్యాయుడి కారణంగా తాను పడిన వేదనను సదరు విద్యార్థిని ఆడియో రికార్డు చేయగా.. ఇప్పుడు అది బయటకు వచ్చింది.

కూతురు వయసు విద్యార్థినితో ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడు. తన రూమ్ కి రమ్మంటూ.. నీచంగా మాట్లాడాడు. ఓ వైద్య విద్యార్థినికి తన ఉపాధ్యాయుడు నుంచే లైంగిక వేధింపులు తప్పలేదు. ఈ సంఘటన నెల్లూరు జీజీహెచ్ లో చోటుచేసుకుంది.

రెండు సంవత్సరాల కిందట ఓ వైద్య విద్యార్థినితో ఓ ఉపాధ్యాయుడు అసభ్యంగా మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అవ్వడంతో.. ఆమె కుటుంబసభ్యులు అతనిపై దాడి చేశారు. దీంతో.. సదరు అధ్యాపకుడిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించి.. విచారణ కమిటీ వేసింది. ఈ ఘటన మరవకముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

మరో కీచక ఉపాధ్యాయుడు విద్యార్థినిపై కన్నేశాడు. అందుకు సంబంధించిన ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఉపాధ్యాయుడి కారణంగా తాను పడిన వేదనను సదరు విద్యార్థిని ఆడియో రికార్డు చేయగా.. ఇప్పుడు అది బయటకు వచ్చింది.

‘నువ్వు నా సోల్ మేట్.. లైఫ్ పార్ట్ నర్.. వైజాగ్ కోడలయ్యేదానివి అంటూ మాట్లాడటం ఏంటి సార్..? నా వయసు 23ఏళ్లు. నాకు తెలిసి మీ పిల్లలకు కూడా ఇదే వయసు ఉంటుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నా.. ఎందుకు ఫోన్ చేస్తున్నారు..? రెస్టారెంట్లు, బీచ్ కి రమ్మని అడుగుతున్నారు.. నీ రూమ్ లో ఏసీ లేదుగా.. నా రూమ్ కి  రా అని ఎలా పిలుస్తారు? ఏం మాటలవి సార్? నేను మౌనంగా ఉన్నానని అనుకుంటున్నారా? మీ నెంబర్ బ్లాక్ చేస్తే.. మరో నెంబర్ నుంచి ఫోన్ చేసి ఎందుకు విసిగిస్తున్నారు? మీ వేధింపుల కారణంగా పుస్తకం కూడా పట్టుకోలేకపోతున్నాను’ అంటూ బాధిత విద్యార్థిని  పేర్కొనడం గమనార్హం. ఈ ఘటనపై  జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్  విచారణకు ఆదేశించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్