రాజమౌళి పరిస్ధితి కూడా కరేపాకేనా  ?

First Published Dec 13, 2017, 3:32 PM IST
Highlights
  • సినీదర్శకుడు రాజమౌళిది కూడా కరివేపాకు పరిస్ధితేనా ?

సినీదర్శకుడు రాజమౌళిది కూడా కరివేపాకు పరిస్ధితేనా ? జరుగుతున్న పరిణామాలు చేస్తుంటే అవుననే అనిపిస్తోంది. రాజధాని అమరావతి డిజైన్ల ఖరారులో రాజమౌళి సాయం తీసుకోవాలని చంద్రబాబునాయుడు నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే. బాహుబలి సినిమా సెట్టింగులతో ఫ్లాట్ అయిపోయిన చంద్రబాబు అదే తరహాలో అమరావతి డిజైన్లను కూడా తయారు చేయించాలంటూ రాజమౌళిని ఆదేశించారు.

స్వయంగా చంద్రబాబంతటి వ్యక్తి అడిగితే రాజమౌళి మాత్రం ఎందుకు కాదంటారు? అందుకని, రాజమౌళి కూడా రెండుసార్లు లండన్ వెళ్ళివచ్చారు. లండన్ ఎందుకంటే, రాజధాని డిజైన్లను రూపొందిస్తున్న నార్మన్ ఫోస్టర్ ఉండేది లండన్లోనే కాబట్టి రాజమౌళి రెండుసార్లు సమావేశమయ్యారు. సరే, తర్వాత అనేక సమావేశాల తర్వాత, డిజైన్లకు మార్పులు, చేర్పుల తర్వాత బుధవారం అసెంబ్లీకి సంబంధించిన ఓ డిజైన్ ను 99 శాతం చంద్రబాబు ఖరారు చేశారు.

అందుకు ఉదయం నుండి సిఆర్డీఏ ఆధ్వర్యంలో చంద్రబాబు పెద్ద సమావేశమే నిర్వహించి డిజైన్లపై కూలంకుషంగా చర్చించారు. చివరకి తేల్చిందేమిటంటే, నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన టవర్ ఆకారంలో ఉన్న అసెంబ్లీ భవనం డిజైనే బాగుందని. రాజమౌళి చేసిన సూచనలను పక్కన పెట్టేసినట్లు సమాచారం. సమావేశం దాదాపు ఏకగీవ్రంగా ఎంపిక చేసింది కాబట్టి ఇక ఆ డిజైన్ ఖరారైనట్లే. మరి, రాజమౌళి చేసిన సూచనలు, సలహాలు ఏమైనట్లు?

పోనీ రాజమౌళి సూచనలేమైనా నార్మన్ ఫోస్టర్ తన డిజైన్లలో ప్రతిబింబించారా అంటే అదీ లేదు. మరి డిజైన్లలో రాజమౌళి పాత్ర ఏముంది? అంటే ఆ విషయమే ఎవరికీ అర్ధం కావటం లేదు. కాకపోతే ప్రచారం కోసం చంద్రబాబు దర్శకుడు రాజమౌళి పేరును మాత్రం ఫుల్లుగా వాడేసుకున్నది వాస్తవం. మరి ఇపుడు బయటకు వచ్చిన అసెంబ్లీ డిజైన్ పరిస్ధితి ఇది. రాబోయే ఇతర డిజైన్లలో రాజమౌళి ముద్ర ఏమైనా ఉంటుందోమో చుడాలి.

ఇదే విషయమై రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ, తెలుగుతల్లి స్ధూపాన్ని ఏర్పాటు చేయాలని తాను చేసిన సూచనకు సమావేశం దాదాపు ఏకగ్రీవంగా అంగీకరించినట్లు చెప్పారు. విగ్రహంపైకి నేరుగా సూర్యకిరణాలు పడేలా తాను డిజైన్ చేశానని చెప్పారు. అసెంబ్లీ డిజైన్ కూడా దాదాపు ఖరారైపోయిందని కూడా రాజమౌళి చెప్పారు.

click me!