కృష్ణా జిల్లాలో దారుణం... సుబాబుల్ తోటలో అర్ధనగ్నంగా చిన్నారి మృతదేహం

Arun Kumar P   | Asianet News
Published : Feb 09, 2022, 02:10 PM ISTUpdated : Feb 09, 2022, 02:19 PM IST
కృష్ణా జిల్లాలో దారుణం... సుబాబుల్ తోటలో అర్ధనగ్నంగా చిన్నారి మృతదేహం

సారాంశం

నిర్మానుష్యంగా వుండే సుబాబుల్ తోటలో ఓ పదేళ్ల చిన్నారి మృతదేహం అర్ధనగ్న స్థితిలో పడివుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

నందిగామ: ఒంటిపై బట్టలు కూడా సరిగ్గాలేని స్థితిలో ఓ ముక్కుపచ్చలారని చిన్నారి మృతదేహం క‌ృష్ణా జిల్లా (krishna district) నందిగామ పరిధిలో లభించింది. నిత్యం నిర్మానుష్యంగా వుండే సుబాబుల్ తోటలో చిన్నారి అర్ధనగ్నంగా ప్రాణాలు కోల్పోయి పడివుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. చిన్నారిని హత్య చేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా అత్యాచారం ఏమయినా జరిగిందేమోనని అనుమానిస్తున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర గ్రామ పరిధిలోని ఇన్వెంటా కర్మాగారం సమీపంలో ఓ బాలిక మృతదేహం పడివున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి, సిఐ నాగేంద్రకుమార్, ఎస్ఐ లక్ష్మి ఘటనాస్థలికి చేరుకుని క్లూస్ టీం సాయంతో ప్రాథమిక ఆదారాలను సేకరించారు. 

ఒంటిపై దుస్తులు కూడా సరిగా లేకుండా అర్ధనగ్న స్థితిలో పడివున్న బాలిక వయస్సు దాదాపు 10 నుండి 11ఏళ్ల మధ్య వుంటుందని భావిస్తున్నారు. నిర్మానుష్యమైన ఈ సుబాబుల్ తోటలో బాలిక తలపై బాది చంపివుంటారని అనుమానిస్తున్నారు. అలాగే బాలిక మృతదేహంపై గాయాలుండటంతో ఆమెపై అత్యాచారమేమైనా జరిగిందా అన్న అనుమానం కలుగుతోంది. 

బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తే బాలికపై అత్యాచారం జరిగిందో లేదో... ఎలా చంపారో తేలనుంది. 

అంతకంటేముందు అసలు ఈ బాలిక ఎవరన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మృతదేహం లభించిన చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు జిల్లాలో ఇటీవల నమోదయిన చిన్నారుల మిస్సింగ్ కేసుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాలిక వివరాలు తెలిస్తే ఆమెను ఇంత కిరాతకంగా ఎవరు చంపారో తేలనుంది. 

ఇదిలావుంటే విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో అమానుషం వెలుగుచూసింది. ఇంట్లో పిల్లలతో కలిసి పడుకున్న ఓ వివాహితపై ఎదురింట్లో వుండే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతకంటే దారుణం ఏంటంటే భర్త వివాహితపై అత్యాచారానికి పాల్పడుతుండగా భార్య ఇదంతా సెల్ ఫోన్ లో చిత్రీకరించింది.   బాధితురాలు పోలీసులను ఆశ్ర‌యించ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.  

విజ‌య‌వాడ న‌గరంలోని భర్తా పిల్లలతో కలిసి ఓ మహిళ నివాసముంటోంది. ఆమె భర్త (25) కేటరింగ్ చేస్తుంటాడు. ఈ నెల 3న భర్త క్యాటరింగ్ పనిపై వెళ్లగా వివాహిత తన ఇంట్లో పిల్లలతో కలిసి నిద్రపోతుండగా  ఎదురింట్లో వుండే దిలీప్‌, తులసి దంపతులు రాత్రి 11 గంటల సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. వివాహిత నోరు మూసి, తమ ఇంట్లోకి లాక్కెళ్లారు. 

ఇలా వివాహితను కిడ్నాప్ చేసి బంధించిన దీలీప్ రెండు సార్లు అత్యాచారం చేయగా ఇదంతా అతడి భార్య వీడియో, ఫొటోలు తీసింది. తర్వాతి రోజు కూడా ఆమెను బెదిరించి మరోసారి అత్యాచారం చేశాడు.  ఈ దారుణాన్ని ఎవరికైనా చెబితే.. మీ పిల్లలిద్దరినీ చంపేస్తానని బెదిరించారు. అంతేకాకుండా తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలని నిందితుడు పదేపదే వేధిస్తుండడంతో బాధితురాలు మహిళా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఘటనపై ఫిర్యాదు చేయగా, నిందితులైన దిలీప్, తులసిపై ఐపీసీ 376(2), 354బి, 354డి, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్