ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నాం..చివరకు మోసం చేశాడు: నగరపాలెం ఎస్ఐపై యువతి ఆరోపణలు..

Published : May 20, 2023, 03:12 PM IST
ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నాం..చివరకు మోసం చేశాడు: నగరపాలెం ఎస్ఐపై యువతి ఆరోపణలు..

సారాంశం

గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలెం ఎస్‌ఐ రవితేజపై ఓ యువతి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రవితేజ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఆరోపించింది.

గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలెం ఎస్‌ఐ రవితేజపై ఓ యువతి  పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ రవితేజ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఆరోపించింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసానికి పాల్పడినట్టుగా ఫిర్యాదులో పేర్కొంది. బెదిరింపులకు కూడా దిగుతున్నాడని తెలిపింది. అయితే ఇదే విషయంపై కొద్దిరోజుల క్రితం గుంటూరు అర్బన్ ఎస్పీకి బాధిత యువతి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ న్యాయం జరగకపోవడంతో మహిళా సంఘాలతో కలిసి నిరసనకు దిగింది. 

అయితే ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటామని బాధిత యువతి తెలిపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. తాను గట్టిగా అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు