ప్రేమ, సహజీవనం.. చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి.. కానీ కొన్ని గంటల్లోనే తీరని విషాదం..

Published : Jun 19, 2022, 07:20 AM IST
ప్రేమ, సహజీవనం.. చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి.. కానీ కొన్ని గంటల్లోనే తీరని విషాదం..

సారాంశం

వారిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు.. కానీ పెద్దలు ఒప్పుకోవడంతో వారిని ఎదురించారు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే ఇరుకుటుంబాల పెద్దల మధ్య కొనసాగిన రాజీయత్నాలు ఫలించడంతో.. వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వారి విహహం జరిగింది.  

వారిద్దరు ప్రేమించి పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు.. కానీ పెద్దలు ఒప్పుకోవడంతో వారిని ఎదురించారు. కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యువతి గర్భం దాల్చింది. మరోవైపు రాజీప్రయత్నాల అనంతరం ఇరుకుటుంబాల పెద్దలు వారి పెళ్లికి అంగీకరించడంతో.. శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. తర్వాత కాసేపటికే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు..  శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం పెద్దకొల్లివలస ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన జమ్మాన పవన్‌కుమార్‌(20) తాపి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అతడికి అదే మండలం.. శ్యామలాపురం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన యోగీశ్వరితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. దీంతో వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. 

అయితే పెద్దలు అంగీకరించకపోయినప్పటికీ.. పవన్‌కుమార్ యువతిని గ్రామానికి తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భిణిగా ఉంది. అయితే ఇరుకుటుంబాల పెద్దల మధ్య కొనసాగిన రాజీయత్నాలు ఫలించడంతో.. వారికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే సింహాచలం దేవస్థానంలో శుక్రవారం రాత్రి పవన్‌కుమార్, యోగీశ్వరిల వివాహం జరిగింది.  

పెళ్లి అనంతరం శనివారం తన తల్లిదండ్రులు, వధువు, ఇతర బంధువులను పవన్‌కుమార్ స్వగ్రామానికి వెళ్లే బస్సు ఎక్కించాడు. పవన్‌కుమార్‌ తన మామ బలగ సోమేశ్వరరావుతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. అయితే ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస పెట్రోల్‌ బంకు సమీపంలోకి రాగానే.. పవన్‌కుమార్ బైన్‌ను వెనుక నుంచి వస్తున్న కంటైనర్‌ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పవన్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌ వెనుక కూర్చొన్న సోమేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. పెళ్లి జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు మృతిచెందడం ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!