కట్నం కోసం భార్యకు వేధింపులు.. డాక్టర్ అరెస్టు

By telugu teamFirst Published May 2, 2019, 1:20 PM IST
Highlights

వరకట్నం కోసం భార్యను నానా రకాలుగా వేధించినందుకు గాను... ఓ ప్రభుత్వ డాక్టర్ ని పోలీసులు అరెస్టు చేవారు. ఈ సంఘటన అమలాపురంలో చోటుచేసుకుంది. 

వరకట్నం కోసం భార్యను నానా రకాలుగా వేధించినందుకు గాను... ఓ ప్రభుత్వ డాక్టర్ ని పోలీసులు అరెస్టు చేవారు. ఈ సంఘటన అమలాపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే...  అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చెందిన డాక్టర్ సూరిశెట్టి విద్యాసాగర్ కి 2014 మే 24న విశాఖలోని దసపల్లా హోటల్‌లో మణిక అనే యువతితో వివాహం జరిగింది.

పెళ్లి సమయంలో రూ.పదిలక్షలు నగదరు, విశాఖలోని పలు చోట్ల మూడు ఇళ్ల ప్లాట్లు, కొంత భూమి కట్నం గా ఇచ్చారు. కాగా.. తనకు కట్నంగా ఇచ్చిన ఆస్తులన్నీ కాబోయే తన భార్య పేరున రాసి ఇస్తేనే వివాహం చేసుకుంటానని మెలిక పెట్టడంతోపాటు ఒత్తిడి కూడా తేవడంతో మణిక తల్లిదండ్రులు వరకట్నంగా ఇచ్చిన ఆస్తులన్నీ రాసి ఇచ్చారు. వారి వివాహమైన తర్వాత వారి కాపురం ఏడాది పాటు సజావుగా సాగింది. 

తర్వాత నుంచి మద్యం సేవించి.. భార్యను హింసించడం మొదలుపెట్టాడు. భార్యపేరిట ఉన్న ఆస్తులను తన పేరిట రాయాలని ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు. భర్త అడిగినట్టుగానే ఆస్తి రాయడానికి మణిక ఒప్పుకుంది. దీంతో నెల రోజుల పాటు బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత నుంచి వాటిని అమ్మేయాలంటూ మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు.

రోజు రోజుకీ వేధింపులు తీవ్రతరం అవడంతో.. తట్టుుకోలేక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ నిఅరెస్టు చేసి విచారిస్తున్నారు. 

click me!