మహర్షి, జెర్సీ చిత్ర బృందాలను అభినందించిన గవర్నర్

Published : Mar 23, 2021, 04:51 PM IST
మహర్షి, జెర్సీ చిత్ర బృందాలను అభినందించిన గవర్నర్

సారాంశం

జాతీయ స్దాయి అవార్డులు సాధించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమను, అయా చిత్ర బృందాలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. 

జాతీయ స్దాయి అవార్డులు సాధించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమను, అయా చిత్ర బృందాలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అభినందించారు. 

జాతీయ పురస్కారాల్లో తెలుగు సినిమా తన ప్రత్యేకతను నిలుపుకోగా, 2019 సంవత్సరానికి గానూ నాలుగు పురస్కారాలను సొంతం చేసుకుంది. కేవలం కధలే కాకుండా సాంకేతికంగా కూడా తెలుగు సినిమా పురోగతిని సాధించటానికి నిదర్శంగా అవార్డులు పొందగలగటం శుభపరిణామని గవర్నర్ అన్నారు.  

ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘జెర్సీ’ జాతీయ పురస్కారాల్ని సొంతం చేసుకోవటం పట్ల బిశ్వభూషణ్ సంతోషం వ్యక్తం చేసారు. 

ఉత్తమ నృత్య దర్శకత్వం (మహర్షి), ఉత్తమ ఎడిటింగ్‌ (జెర్సీ) విభాగాల్లో జాతీయ పురస్కారాలు దక్కటం తెలుగు సినిమా గొప్పతనాన్ని వెల్లడిస్తుందని రాష్ట్ర గవర్నర్ గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్  పేర్కొన్నారు.  

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం