
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి శ్రీకాకుళం సభలో అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గౌతు శ్యామసుందర శివాజీ అలిగి సభా వేదిక దిగి వెళ్లిపోయారు.
మంత్రి అచ్చెన్నాయుడు సముదాయించడానికి ప్రయత్నించారు. అయితే, ఆయన వినలేదు. అక్కడి నుంచి కారెక్కి వెళ్లిపోయారు. ఆయనతో పాటు ఆయన కూతురు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష కూడా తండ్రితో పాటు కారెక్కి వెళ్లిపోయారు.
ఓ కార్యకర్తను లోపలికి అనుమతించకపోవడంతో శివాజీ అలక వహించారు. తనను అవమానించారని ఆరోపిస్తూ ఆయన సభ నుంచి వెళ్లిపోయారు.