AP PRC: ప్రభుత్వోద్యోగులకు గుడ్ న్యూస్... సాయంత్రమే ఉద్యోగసంఘాల చేతికి పీఆర్సీ నివేదిక (Video)

By Arun Kumar P  |  First Published Dec 13, 2021, 4:38 PM IST

ఇవాళ సాయంత్రం జగన్ సర్కార్ నుండి ఉద్యోగ సంఘాల చేతికి పీఆర్సి నివేదిక అందనుందని  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ సూర్యనారాయణ తెలిపారు. 


అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పీఆర్సి ప్రకటన ఇవాళ రేపట్లో (సోమ, మంగళవారం) వుండనుంది.  పీఆర్సీ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో సోమవారమే సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కు పీఆర్సీ కమిటీ తుది నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.  ఈ నివేదిక పరిశీలన అనంతరం సీఎం ఫిట్ మెంట్ ను ఖరారు చేయనున్నారు. సీఎం నిర్ణయం తర్వాత ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇవ్వనున్నారు. ఈ సాయంత్రం లేదా రేపు(మంగళవారం) అధికారికంగా ప్రభుత్వ ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు ప్రభుత్వ  వర్గాలు చెబుతున్నాయి. 

పీఆర్సి ప్రకటన (PRC Announcement) పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రామ సూర్యనారాయణ (employees union president rama suryanarayana) స్పందించారు. ఇప్పుడే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (sajjala ramakrishna reddy) తనకు కాల్ చేసి పీఆర్సి ప్రకటనపై క్లారిటీ ఇచ్చినట్లు  తెలిపారు.   

Latest Videos

undefined

Video

''ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద పీఆర్సీ అంశంపై అధికారుల సమావేశం జరిగింది. కార్యదర్శుల కమిటీ నివేదిక (prc committee) ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సిఎంకి ఇస్తారు. అదే నివేదిక సాయంత్రం 6 గంటలకు ఉద్యోగ సంఘాలకు చీఫ్ సెక్రటరీ (CS) ఇస్తారు. రేపు సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై అంతిమ నిర్ణయం తీసుకుంటారు'' అని సజ్జల చెప్పినట్లు సూర్యనారాయణ వెల్లడించారు. 

READ MORE  AP Employees: ఏపీలో ఉద్యోగుల పోరుబాట.. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు

ఇటీవల వరద బాధితుల పరామర్శ కోసం తిరుపతిలో పర్యటించిన సమయంలో  సీఎం జగన్ పీఆర్సిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పీఆర్సీ గురించి కొందరు ఉద్యోగులు ప్రశ్నించగా వారిని దగ్గరకు పిలుచుకున్న సీఎం పదిరోజుల్లో పీఆర్సీపై ప్రకటన వుంటుందని తెలిపారు. ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియ పూర్తైందని... తుది నిర్ణయమే మిగిలిందని సీఎం జగన్ ఉద్యోగులకు తెలిపారు. 
 
ఇదిలావుంటే పీఆర్సీ అమలు, డీఏ, సీపీస్ రద్దు సహా తమ డిమాండ్‌ల కోసం గత మంగళవారం నుంచి ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాయాల్లో పనిచేసే ఉద్యోగులు వివిద రూపాల్లో   నిరసన తెలుపుతున్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నిరసనలో పాల్గొంటున్నాయి. 

ఉద్యోగులు గత మంగళవారం (డిసెంబర్ వ తేదీ) నుంచి మూడు రోజుల పాటు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఇక గత శుక్రవారం (డిసెంబరు 10వ తేదీ) నుండి మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన చేపట్టారు. ఇక ఇవాళ (డిసెంబర్ 13వ తేదీ) ర్యాలీలు చేపట్టారు.

READ MORE  తప్పంతా జగన్ సర్కార్‌దే.. ఓపిక పట్టాం, వేరే దారి లేకే ఇలా : ఉద్యమ కార్యచరణపై ఏపీ ఉద్యోగ నేతల కామెంట్స్

ఇక డిసెంబర్ 16న అన్ని తాలుకాలు, డివిజన్లు, ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు చేపట్టనున్నట్లు ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రకటించారు. అలాగే డిసెంబర్ 21న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టుగా  ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే పీఆర్సి ప్రకటన తర్వాత ఉద్యోగసంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. 

click me!