‘గాడ్ ఫాదర్’ చిరంజీవిని చూడడానికి వస్తూ.. ప్రమాదంలో యువకుడు మృతి..

Published : Oct 01, 2022, 08:24 AM IST
‘గాడ్ ఫాదర్’ చిరంజీవిని చూడడానికి వస్తూ.. ప్రమాదంలో యువకుడు మృతి..

సారాంశం

తన అభిమాన నటుడిని చూడడానికి వస్తూ ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు.   

అనంతపురం : మెగాస్టార్ చిరంజీవి అంటే నిలువెల్లా ఆ యువకుడికి అభిమానం. కళ్లారా చూడాలన్న తాపత్రయం. సినీ గాడ్ ఫాదర్ ను హైదరాబాద్ కు వెళ్లి చూసూ అవకాశం ఎలాగూ ఉండదు. బుధవారం అనంతపురం వస్తున్నారని తెలిసి.. మిత్రుడిని వెంటబెట్టుకుని గుత్తి నుంచి ద్విచక్ర వాహనం మీద ఆత్రంగా బయల్దేరారు. మరో పదినిమిషాల్లో సభా ప్రాంగణానికి చేరుకుంటాడు. అంతలోనే గార్ల దిన్నె వద్ద మృత్యువు అతన్ని ప్రమాదరూపంలో కబలించింది. 

అయితేనేం అభిమానం ‘చిరంజీవి’గా వెలుగునివ్వాలని అతని కుటుంబ సభ్యులు భావించారు. నేత్రాలను దానం చేస్తే.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగునిస్తాడని భావించారు. అనుకున్నదే తడవుగా నేత్రాలను దానం చేశారు. గుత్తి పట్టణానికి చెందిన రాజశేఖర్ (22) కళ్లను అతని కుటుంబ సభ్యులు సాయిట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ద్వారా నేత్రాలను గురువారం సేకరించారు. కళ్లను సేకరించిన వారిలో సాయి ట్రస్ట్ సభ్యులు విజయసాయి, నారాయణ, ఎల్వీ ప్రసాదర్ ఆస్పత్రి టెక్నీషియన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

ఏపీ పాఠశాల విద్యా శాఖ పదవికి ఆకునూరి మురళీ రాజీనామా.. జగన్‌కు లేఖ

PREV
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?