తండ్రి చేసిన అప్పు తీర్చాలని ఇంటికొచ్చిన బ్యాంక్ అధికారులు.. మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య..

Published : Jul 28, 2022, 11:19 AM IST
తండ్రి చేసిన అప్పు తీర్చాలని ఇంటికొచ్చిన బ్యాంక్ అధికారులు.. మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య..

సారాంశం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేటలో విషాదం చోటుచేసుకుంది. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఆమె బలవనర్మణానికి పాల్పడింది.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేటలో విషాదం చోటుచేసుకుంది. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఆమె బలవనర్మణానికి పాల్పడింది. వివరాలు.. విద్యార్థిని జాస్తి హరిత వర్షిణి ఏపీ ఎంసెట్‌లో 15 వేల ర్యాంక్ సాధించింది. అయితే ఆమె తండ్రి ప్రభాకర్ రావు  బ్యాంకులో నుంచి రుణం తీసుకున్నారు. ప్రభాకర్ రావు తీసుకున్న అప్పు తీర్చాలని బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి అవమానించారు. దీంతో మనస్తాపం చెందిన వర్షిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక స్థోమత లేక, అప్పులు, అవమానాలు భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వర్షిణి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన వర్షిణి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.  
 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్