Giddalur assembly elections result 2024 :గిద్దలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE

By Shivaleela Rajamoni  |  First Published Jun 4, 2024, 8:23 AM IST

Giddalur assembly elections result 2024 : ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిద్దలూరు ఒకటి. ఇక్కడ ప్రస్తుతం అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే సిట్టింగ్ ను మరోచోటికి షిప్ట్ చేసి కొత్త అభ్యర్థిని గిద్దలూరు పోటీలో నిలిపింది వైసిపి. దీంతో గిద్దలూరు ప్రజల తీర్పు ఎలా వుంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


Giddalur assembly elections result 2024 :

గిద్దలూరు రాజకీయాలు :

Latest Videos

undefined

గిద్దలూరు రాజకీయాలను చాలాకాలం పిడతల కుటుంబమే శాసించింది. ఈ గిద్దలూరు నుండి అనేకమార్లు ప్రాతినిధ్యం వహించిన పిడతల రంగారెడ్డి మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నత పదవులు నిర్వహించారు. ఆయన ఐదుసార్లు  (1955, 1967, 1972, 1978, 1985), మూడు పార్టీల (కాంగ్రెస్, జనతా, టిడిపి) తరపున గిద్దలూరు ఎమ్మెల్యేగా పనిచేసారు. ఆ తర్వాత పిడతల రామభూపాల్ రెడ్డి, పిడతల విజయ్ కుమార్ రెడ్డి, పిడతల సాయి కల్పన కూడా ఎమ్మెల్యేలుగా పనిచేసారు. 

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన 2009 ఎన్నికల్లో పోటీచేసింది... ఇందులో గెలిచిన కొన్ని నియోజకవర్గాల్లో గిద్దలూరు ఒకటి.  మొదట పిఆర్పి నుండి గెలిచిన అన్నా రాంబాబు 2014 లో టిడిపి నుండి పోటీచేసిఓఢిపోయారు. ఆ తర్వాత వైసిపిలో చేరిన ఆయన 2019  పోటీచేసి గెలిచారు. అయితే ఈసారి ఆయనను మార్కాపురంకు షిప్ట్ చేసి గిద్దలూరులో కొత్త అభ్యర్థిని పోటీలో నిలిపారు వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.  

 గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. బెస్తవారిపేట
2.  రాచర్ల
3.  కొమరోలు
4. కంభం
5. అర్ధవీడు
6. గిద్దలూరు
 
గిద్దలూరు అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) -   2,38,144
పురుషులు -   1,20,958
మహిళలు ‌-    1,17,168

గిద్దలూరు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

ఈసారి గిద్దలూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ను మార్చింది వైసిపి. ప్రస్తుత ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురంకు షిప్ట్ చేసి గిద్దలూరులో కుందూరు నాగార్జునరెడ్డిని బరిలో నిలిపింది.

టిడిపి అభ్యర్థి :

తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని బరిలో నిలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి చేతిలో ఓడిపోయారు అశోక్ రెడ్డి... అయినప్పటికి ఆయనపై నమ్మకంతో ఈసారి మళ్లీ అవకాశం ఇచ్చారు. 

గిద్దలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

గిద్దలూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,96,036 (84 శాతం) 

వైసిపి - అన్నా రాంబాబు - 1,33,111 ఓట్లు (67 శాతం) - 81,035 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి- ముత్తుముల అశోక్ రెడ్డి - 52,076 ఓట్లు (26 శాతం) - ఓటమి
 
గిద్దలూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,82,105 (82 శాతం)

వైసిపి - ముత్తుముల అశోక్ రెడ్డి - 94,413 (55 శాతం) ‌- 12,893 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - అన్నా రాంబాబు - 81,520 (44 శాతం) ఓటమి

 

click me!