కోడి పందాల కోసం బరులు సిద్ధం : కాలు దువ్వాలని కోళ్లకు వయాగ్రా, స్టెరాయిడ్స్ .. అసలుకే ఎసరు

By Siva KodatiFirst Published Jan 7, 2024, 3:57 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ జరిగే మూడు రోజులు కోడిపందాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. నెల రోజుల ముందు నుంచే బరులు గీసి పుంజులను సిద్ధం చేస్తున్నారు. అయితే రాణిఖెత్ అనే వైరల్ వ్యాధి ఛాంపియన్ రూస్టర్‌లను బలహీనపరిచింది.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ జరిగే మూడు రోజులు కోడిపందాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. నెల రోజుల ముందు నుంచే బరులు గీసి పుంజులను సిద్ధం చేస్తున్నారు. అయితే రాణిఖెత్ అనే వైరల్ వ్యాధి ఛాంపియన్ రూస్టర్‌లను బలహీనపరిచింది. పెంపకందారులు పరిష్కారాల కోసం గిలగిలలాడుతున్నారు. రాబోయే పోరాటాల కోసం ఈ పక్షులను సిద్ధం చేసే తీరని ప్రయత్నంలో కొంతమంది పెంపకందారులు అసాధారణ పద్ధతులను ఆశ్రయించడం వల్లే ఈ వ్యాధి వ్యాపించినట్లుగా తెలుస్తోంది. వయాగ్రా, షిలాజిత్, స్టెరాయిడ్‌ల మిశ్రమాన్ని వాటికి తినిపించారు. 

సాధారణంగా , కోడిపందాలు సంక్రాంతి సంబరాలలో అంతర్భాగం. ప్రధానంగా అవిభక్త గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల వంటి ప్రాంతాలలో ఇవి అత్యధికం. జనవరి 14, 15 , 16 తేదీలలో పండుగ జరగనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా బరులు పుట్టుకొస్తున్నాయి. శిక్షణ పొందిన పుంజులు తీవ్రమైన యుద్ధాల్లో పాల్గొంటాయి. ప్రేక్షకులు ఫలితాలపై పందెం వేస్తారు. ఫలితంగా గణనీయమైన ద్రవ్య మార్పిడి జరుగుతుంది. 

Latest Videos

రాణిఖెత్ వ్యాధి కారణంగా పుంజులు గణనీయంగా ప్రభావితమవుతున్నాయి. ఈ వ్యాధి సోకితే కోళ్లు కఠినమైన పోరాటాలకు సరిపోవు. పక్షులను త్వరగా పునరుద్ధరించడానికి , పెంపకందారులు వయాగ్రా, షిలాజిత్ , విటమిన్‌ల కాక్టెయిల్ వైపు మొగ్గు చూపారు. ఈ పదార్ధాలు తాత్కాలికంగా పక్షుల పనితీరును మెరుగుపరుస్తాయి. పశువైద్యులు అటువంటి ఔషధాల వాడకం కోళ్లకు హాని కలిగిస్తుందన్నారు. ఇలాంటి పక్షులను మనుషులు తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోళ్లలో హార్మోన్ స్థాయిలను ప్రేరేపించడానికి పెంపకందారులు మనుషుల్లో కామోద్దీపనల కోసం ఉపయోగించే వయాగ్రాలను వాడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ కోళ్లలో పోరాట స్పూర్తిని పెంచడంలో ఔషధాల వాస్తవ ప్రభావం అనిశ్చితంగానే వుంది. తాజా పరిస్థితిని వివరిస్తూ.. ఒక పెంపకందారుడు పౌల్ట్రీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను వెల్లడించాడు. సంక్రాంతి సంబరాలకు కోళ్లను సిద్ధం చేయాలని, కోళ్ల బరువు, చురుకుదనంతోనే పందాలు ఆధారపడి వున్నాయన్నారు. 

click me!