టీడీపీ పై బురదజల్లడమే వైసీపీ ప్రభుత్వ పని.. గల్లా జయదేవ్ ఫైర్

By telugu news teamFirst Published Feb 22, 2020, 9:53 AM IST
Highlights

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనడం సరికాదన్నారు. రాజకీయ కారణాలతోనే సిట్ వేశారని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. 67వ రోజు దీక్ష సందర్భంగా వెలగపూడిలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు ఎంపీ గల్లాజయదేవ్, టీడీపీ నేతలు మద్దతు తెలిపారు.

వైసీపీ ప్రభుత్వంపై  గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్ మండిపడ్డారు.  శనివారం వెలగూడిలో రాజధాని రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అధికార ప్రభుత్వం చేస్తున్న పనులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై జగన్‌ ప్రభుత్వం సిట్ వేయడంపై ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. టీడీపీపై బురదజల్లడమే వైసీపీ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ చర్యలతో భయపడేదేమీలేదని స్పష్టం చేశారు. 

అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనడం సరికాదన్నారు. రాజకీయ కారణాలతోనే సిట్ వేశారని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. 67వ రోజు దీక్ష సందర్భంగా వెలగపూడిలో రైతులు చేపట్టిన 24 గంటల దీక్షకు ఎంపీ గల్లాజయదేవ్, టీడీపీ నేతలు మద్దతు తెలిపారు.

Also Read దొంగ పేపర్, దొంగ చానెల్ ట్రాప్ లో పడి...: సాక్షి మీడియాపై నారా లోకేష్...

కాగా.. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు జగన్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్ ను) ఏర్పాటు చేశారు. 

సీనియర్ ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో పది మంది సభ్యులతో ఈ సిట్ ను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తు మొదలు విచారణ, చార్జిషీట్ వరకు అధికారాలు కట్టబెడుతూ ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. 

మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని అంశాలపై దర్యాప్తు చేసి కేసులు దాఖలు చేసేందుకు ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. సీఆర్డీఎ పరిధిలో జరిగిన అవినీతి, ఇన్ సైడర్ ట్రేడింగ్, బినామీ లావాదేవీలు వంటి అంశాలపై సిట్ దర్యాప్తు చేస్తుంది. అమరావతి విషయంలోనే కాకుండా ఇతర ప్రాజెక్టులపై కూడా సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. 

గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సాక్షులను విచారించడంతో పాటు చార్జిషీట్ కూడా సిట్ దాఖలు చేయడానికి అధికారాన్ని కలిగి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినవారు పలువురు చిక్కులను ఎదుర్కునే అవకాశం ఉంది. 

అమరావతిలో అక్రమాలపై ఇప్పటికే సీఐడీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసింది. పలువురు బినామీలు అమరావతి రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూములు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. బినామీలను ఏర్పాటు చేసుకుని వారు భూములను సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

click me!