అమెరికా నుండి పోస్టు ద్వారా గంజాయి: తెలుగోడి ఘనకార్యం!

By Sree sFirst Published Apr 28, 2020, 1:34 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి ఏకంగా అమెరికా నుండి గంజాయిని కొనుగోలు చేసాడు. అక్కడి నుండి అది ఇంటికి పార్సెల్ రూపంలో చేరుకునే లోగా చెన్నైలో అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. 

కరోనా దెబ్బకు భారతదేశంలో లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ దెబ్బకు నిత్యావసరాలు తప్ప అన్ని దుకాణాలు, సేవలు నిలిచిపోయాయి. ఈ దెబ్బకు మందుబాబులు అల్లాడిపోతున్నారు. మందు దొరక్క వారు చేస్తున్న పిచ్చి పనులను మనం చూస్తూనే ఉన్నాము. 

ఇక ఈ లాక్ డౌన్ కాలంలో మత్తు కోసం ప్రయత్నించే వారు దొంగ దారుల్లో ఆ మత్తు పదార్థాలను సంపాదిస్తూనే ఉన్నారు. ఆ లీలలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఒక సంఘటనే భారతదేశములో బయటపడింది. ఈ ఘనకార్యం చేసింది మన తెలుగువాడే. 

ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఒక వ్యక్తి ఏకంగా అమెరికా నుండి గంజాయిని కొనుగోలు చేసాడు. అక్కడి నుండి అది ఇంటికి పార్సెల్ రూపంలో చేరుకునే లోగా చెన్నైలో అధికారులు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. 

వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్ లో అన్నవరానికి చెందిన ఒక వ్యక్తి వాషింగ్టన్ రాష్ట్రంలోనూ వాంకోవర్ నగరం నుంచి ఈ గంజాయిని ఆర్డర్ ఇచ్చాడు. అది అక్కడి నుండి పార్సెల్ రూపంలో ఇండియాలోని అతని అడ్రస్ కి పంపించబడింది. 

స్లీపింగ్ బాగ్స్ అని ఆ పార్సెల్ పైన రాసుంది. ఎన్నో పిపిఈ కిట్లు ఈ సమయం లో వస్తున్న తరుణంలో అది కూడా ఇలాంటిదే అనుకోని అధికారులు లైట్ తీసుకున్నారు. కాకపోతే ఎందుకో అనుమానం వచ్చిన అధికారులు ఆ పార్సెల్ ను తెరిచి చూడగా అందులో స్లీపింగ్ బ్యాగుల మధ్యలో గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు 9 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. 

అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఆహ్లాదం కోసం, వినోదం కోసం కొంత మోతాదులో గంజాయిని తీసుకోవడానికి అనుమతిస్తారు.  అక్కడ వీటి అమ్మకాలు కూడా లీగల్.దీన్ని ఆసరాగా చేసుకొనే సదరు వ్యక్తి ఇలా గంజాయిని తెప్పించుకునేందుకు యత్నించి ఉండవచ్చని తెలియవస్తుంది. 

ఆ వ్యక్తిని పట్టుకునేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఆ పార్సెల్ అమెరికాలో ఒక కంపెనీ నుంచి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ లాక్ డౌన్ కాలంలో తాము సీజ్ చేసిన తొలి మత్తు పదార్థాలు పార్సెల్ ఇదే అని అధికారులు చెబుతున్నారు. 

click me!