హెరిటేజ్ పాలు లీటరుకు రూ.4 పెంపు, బాబు కంటే రాబందులే నయం: ఎంపీ బాలశౌరి

Published : Apr 28, 2020, 01:08 PM ISTUpdated : Apr 28, 2020, 01:14 PM IST
హెరిటేజ్ పాలు లీటరుకు రూ.4 పెంపు, బాబు కంటే రాబందులే నయం: ఎంపీ బాలశౌరి

సారాంశం

ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో కూర్చొని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంపై రాళ్లు విసురుతున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి విమర్శించారు.   

అమరావతి: ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో కూర్చొని ఆంద్రప్రదేశ్ రాష్ట్రంపై రాళ్లు విసురుతున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి విమర్శించారు. 

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో నాయకత్వ లక్షణాల గురించి చంద్రబాబు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు మాటలను చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు.

ప్రజలు కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతుంటే హెరిటేజ్ పాల ధరను లీటరుకు నాలుగు రూపాయాలు పెంచడం నాయకత్వమా అని ఎంపీ బాలశౌరి ప్రశ్నించారు. ప్రజలను దోచుకోవడంలో చంద్రబాబు కంటే రాబందులు నయమని ఆయన విమర్శలు గుప్పించారు.

also read:ఏపీపై కరోనా దెబ్బ: 24 గంటల్లో 82 కేసులు, మొత్తం 1,259కి చేరిక

కరోనా విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబునాయుడు మండిపడ్డారు. సోమవారం నాడు జగన్ మీడియాతో మాట్లాడారు మీడియా సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై జగన్ తీరును చంద్రబాబు తప్పుబట్టారు. ఈ విషయమై జగన్ పై బాబు విమర్శలు చేశారు. జగన్ పై బాబు చేసిన వ్యాఖ్యలపై  ఎంపీ బాలశౌరి మంగళవారం నాడు స్పందించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!