సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మీద స్నేహితుడు అత్యాచారయత్నం.. ఆపై బెదిరింపులు..

Published : Apr 06, 2021, 10:36 AM IST
సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మీద స్నేహితుడు అత్యాచారయత్నం.. ఆపై బెదిరింపులు..

సారాంశం

తన మీద కొల్ల మణికంఠ అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడడంతో పాటు.. తన తో దిగిన ఫోటోలతో బెదిరిస్తున్నట్లు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని భవానిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సదరు యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలోని భవానిపురంలో నివాసం ఉంటున్నారు.

ఆమె హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నారు. కాగా వర్క్ ఫ్రం హోం కావడంతో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తున్నారు ఆమె ఇంజన్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో అదే కాలేజీలో ఎంబీఏ చదువుతున్న మణికంఠతో పరిచయం ఏర్పడింది.

 ఇద్దరు స్నేహితులుగా ఉంటూ కలిసి ఫోటోలు దిగారు. ఆమె ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో అతని ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా, తప్పించుకుని బయటకు వచ్చేశారు.

అయితే ఇటీవల ఆమెకు వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఆమె ఫోటోలను మ్యాట్రిమోనీ వెబ్సైట్ లో పెట్టారు. వాటిని చూసిన మణికంఠ గత నెల 25వ తేదీన ఆమె ఇంటికి వచ్చి తనను వివాహం చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు.

తిరిగి ఈ నెల ఒకటవ తేదీన ఇంటికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడాడు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీనితో ఆమె భవానిపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu