రాత్రి వేళ ప్రేయసిని బయటకు తీసుకుని వెళ్లి ప్రాణాలకు తెచ్చుకున్న విద్యార్థి

By telugu team  |  First Published Apr 6, 2021, 8:06 AM IST

ప్రేయసిని హాస్టల్ నుంచి బయటకు తీసుకుని వెళ్లి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నాడు ఓ బిబీఏ విద్యార్థి. హాస్టల్ లోకి ప్రేయసిని పంపించే ప్రయత్నంలో అతను భవనంపై నుంచి జారి పడి మరణించాడు.


తాడేపల్లి: తన ప్రేయసిని రహస్యంకు హాస్టల్ నుంచి బయటకు తీసుకుని వెళ్లి తిరిగి హాస్టల్ లో దించే క్రమంలో బిబీఏ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఆ విద్యార్థి ఆదివారం రాత్రి మరణించాడు. సోమవారంనాడు మృతుడి తండ్రి తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. 

వడ్డేశ్వరంలోని కెఎల్ యూనివర్శిటీలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన నేతి వినయ్ కుమార్ (20), అతని మిత్రుడు బండ్ల మనీశ్వర్ చౌదరి కలిసి ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే యూనివర్శిటీ విద్యార్థినుల హాస్టల్ ఉంటున్న తమ స్నేహితులకు ఫోన్ చేసి వారిని బయటకు రప్పించారు. 

Latest Videos

అదే సమయంలో హాస్టల్ ఉంటున్న తోటి విద్యార్థినులు ఫోన్ చేసి వాచ్ మన్ గమనిస్తున్నాడని, వెంటనే వచ్చేయమని చెప్పారు. దీంతో వారు హాస్టల్ గోడ దూకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఇద్దరు విద్యార్థినుల్లో ఓ విద్యార్థిని లోపలకు క్షేమంగా వెళ్లిపోయింది. మరో విద్యార్థిని మాత్రం గోడ ఎక్కే క్రమంలో జారి పడింది. అదే సమయంలో వాచ్ మన్ కేకలు వేశాడు దాంతో విద్యార్థిని, ఆమె మిత్రుడు బేతి వినయకుమార్ ఆందోళనతో హాస్టల్ పక్కన ఉన్న మరో భవనంపైకి పరుగులు తీశారు. 

ఆ భవనంలోని వాచ్ మన్ కూడా కేకలు వేయడంతో విద్యార్థిని మెట్లపై ఉండిపోయింది. వినయ్ కుమార్ మాత్ర భవనంపైకి వెళ్లి పైన రేకుల షెడ్ ఎక్కి ప్రమాదవశాత్తు కిం పడి మరణించాడు. హాస్టల్ నిర్వాహకులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు వినయ్ కుమార్ మిత్రుడు మనీశ్వర చౌదరి వినయ్ కుమార్ తండ్రి సమాచారం ఇచ్చాడు. దాంతో సోమవారం ఆయన కొడుకు మరణంపై అనుమానాలున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా, నేతి వెంకట వినయ్ కుమార్ కు, మిత్రురాలికి మద్య గుంటూరులో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు చెబుతున్నారు ఐదేళ్లుగా వారు ప్రేమించుకునంటున్నారు. యూనివర్శిటీలో చేరినప్పటి నుంచి వారిద్దరు తరుచుగా బయటకు వెళ్లి కలుసుకుంటున్నారని సమాచారం. 

ఇటీవల అదే క్లాసులోని మరో ఇద్దరు ప్రేమలో పడ్డారు. దీంతో రెండు జంటలు కలిసి బయటకు వెళ్లి వస్తుంటారని చెబుతున్నారు ప్రకాశం జిల్లా కొండపి మండలం నేతివారిపాలెంకు చెందిన వీఆర్వో రామకృష్ణ, ప్రశాంతి దంపతులకు వినయ్ కుమార్ ఒక్కడే కొడుకు. పుత్రుడి మరణంతో వారి ఆవేదనకు అంతు లేకుండా ఉంది.

click me!