వార్నీ... ఎంత మాయచేశాడు..పెళ్లి పేరుతో ఘరానా మోసం.. యువతి నుంచి రూ. 48లక్షలు వసూలు...

By Bukka SumabalaFirst Published Sep 3, 2022, 1:46 PM IST
Highlights

పేరు మార్చి, ఫొటో మార్చి.. మాట్రిమోనియల్ ఫ్రాడ్ కు పాల్పడ్డాడో కేటుగాడు. ఏకంగా యువతి నుంచి రూ. 48 లక్షలు వసూలు చేశాడు. 

పల్నాడు : పల్నాడు జిల్లా నరసరావుపేటలో పెళ్లి పేరుతో ఘరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన యువతికి మాట్రిమొనిలో విజయవాడకు చెందిన పొట్లూరి వంశీ కృష్ణ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. కొచేర్ల శ్రీకాంత్ పేరుతో ఫేక్ ఐడితో ఈ మోసానికి పాల్పడినట్లు తేలింది.

యువతి నుండి వీసా కోసం నిందితుడు రూ.48.56 లక్షలు వసూలు చేశాడు. ఈ మేరకు యువతి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో అతనిమీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వీళ్ల దుంపతెగా ఇదేం చోరీ.. వినాయకుడి చేతిలో లడ్డూ దొంగతనం.. సీసీ టీవీలో నిక్షిప్తం..

కాగా, ఇలాంటి ఘటనే మార్చిలో హైదరాబాద్ లో చోటుచేసుకుంది. మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయమై పెళ్లి పేరుతో ఓ మహిళ తన దగ్గర రూ.46 లక్షలు దోచేసిందని బాధితుడు హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీబీ కేవిఎం ప్రసాద్ కథనం ప్రకారం.. కోఠిలోని ఓ నేషనల్ మేనేజర్ పెళ్లి సంబంధాలు వెతుకుతున్నాడు. ఓ వివాహ వెబ్సైట్లో తన వివరాలను పొందుపరిచాడు. అది చూసిన ఓ అమ్మాయి అతనికి ఫోన్ చేయింది. ‘మీరు నాకు నచ్చారు... మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పింది. అంతే కాదు తాను ముంబైలో ఉంటానని ఫోటోలు, బయోడేటా పంపించింది. 

ఆ తరువాత కొంతకాలం చాటింగ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి చూడాలని ఉంది.. అనడంతో ఆ వ్యక్తి ఓసారి ముంబైకి వెళ్లి ఆమెను కలిసి వచ్చాడు కూడా... ఆ తర్వాతే అసలు నాటం మొదలయ్యింది. ఒకసారి ‘మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు’ అని.. మరోసారి ‘నాన్నకు బాగాలేదని’ ఇలా వివిధ కారణాలు చెబుతూ బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంది. అలా విడతలవారీగా రూ.46 లక్షలు దండుకుంది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విఛాఫ్ రావడం.. ఎంతకీ కలవకపోవడం.. మెసేజ్ లకూ రిప్లైలు రాకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహించిన బ్యాంకు మేనేజర్ హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

click me!