ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసన: సెషన్ పూర్తయ్యే వరకు నలుగురు ఎమ్మెల్యేల సస్పెండ్

By narsimha lode  |  First Published Mar 22, 2022, 10:26 AM IST


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభంగా కాగానే  టీడీపీ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ ఈ నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.


అమరావతి: Andhra Pradesh అసెంబ్లీ నుండి నలుగురు TDP MLAsను మంగళవారం నాడు Suspend చేశారు. శాసనసభా సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుండి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ Tammineni Sitaram ప్రకటించారు.

మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. అయితే జంగారెడ్డిగూడం మరణాలపై చర్చతో పాటు జె బ్రాండ్ మద్యంపై  చర్చకు పట్టుబడ్డారు. అయితే ఈ విషయమై చర్చ కోరుతూ పోడియం వద్దకు రావడానికి ప్రయత్నించారు.

Latest Videos

 అయితే పోడియం వద్దకు వస్తే సస్పెండ్ చేస్తానని స్పీకర్ ప్రకటించారు. అయితే తమ స్థానాల్లోనే నిలబడి టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు.  సభ్యులుగా ఉన్న మీరు ప్రశ్నోత్తరాలలో పాల్గొంటారని ఎదురు చూశాం. మీరు సభా గౌరవాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని  ఇవాళ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ నెల 25వ  తేదీ వరకు నలుగురు టీడీపీ సభ్యులను  సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభ కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్న నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు. 

ఏపీ అసెంబ్లీ నుండి బెందాళం ఆశోక్, అనగాని సత్యప్రసాద్, రామరాజు, వెలగపూడి రామకృష్ణబాబులు  అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.జంగారెడ్డి మరణాలపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రతి రోజూ ఆందోళన చేస్తున్నారు.ఈ విషయమై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. ఇదే అంశంపై ఐదుగురు ఎమ్మెల్యేలను గతంలోనే ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు. ఇవాళ నలుగురిని సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు.  మిగిలిన సభ్యులు కూడా సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని ప్రతి రోజూ సస్పెండ్ అవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై చర్చకు టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయమై ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ రాష్ట్ర వైద్య ఆర్గ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కూడా అసెంబ్లీలో ప్రకటన చేశారు. అయితే ఈ విషయమై చర్చకు టీడీపీ సభ్యులు  పట్టుబడుతున్నారు.  అయితే చర్చ కోరుతున్న టీడీపీ సభ్యులు మరో రూపంలో చర్చ కోసం  అనుమతి కోరాలని వైసీపీ సభ్యులు సూచిస్తున్నారు.  సభా కార్యక్రమాలు సాగుతున్న సమయంలో జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ సభ్యులు నిరసనకు దిగుతున్నారు. అయితే దీంతో వారిని సభ నుండి సస్పెండ్ చేస్తున్నారు. ప్రతి రోజూ ఏపీ అసెంబ్లీలో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. 

సభలో టీడీపీ ఎమ్మెల్యేల విజిల్స్.. స్పీకర్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసబలో మంగళవారం నాడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. శాసనసభలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు విజిల్స్ వేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలను సభ నుండి సస్పెండ్ చేశారు. అంతకు ముందే సభ నుండి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. 

సభలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును స్పీకర్ తమ్మినేని సీతారాం తప్పుబట్టారు. గద్దె రామ్మోహన్ రావు, ఏలూరి సాంబశివరాలను సభ నుండి సస్పెండ్ చేశారు. దీంతో ఇవాళే సభ నుండి ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరును వైసీపీ సభ్యులు తప్పు బట్టారు. అసెంబ్లీలో ఉంటూ ఇలా వ్యవహరించడం సరైందేనా అని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు. 

click me!