నారా లోకేశ్ పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి బూతు పంచాగం

Published : Mar 22, 2022, 09:45 AM ISTUpdated : Mar 22, 2022, 09:57 AM IST
నారా లోకేశ్ పై  ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి బూతు పంచాగం

సారాంశం

టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ‌ స్వామి సీరియస్ అయ్యారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్ల అమర్యాదగా మాట్లాడటం సరైంది కాదని అన్నారు. శాసన సభలో లోకేశ్ ను తీవ్రంగా దూషించారు. 

టీడీపీ (TDP) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ (Mlc Nara Lokesh)పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ‌ స్వామి (ap deputy cm narayana swamy) తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. బూతులతో దూషించారు. త‌మ సీఎంనే కించ‌ప‌రిచేలా మాట్లాడుతావా ? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ అసెంబ్లీలోనే ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. 

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమ‌వారం శాస‌న స‌భ‌లో ప్ర‌భుత్వం ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ (ఐఎంఎఫ్ఎల్‌) చట్ట సవరణ బిల్లులను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ సంద‌ర్భంగా చ‌ర్చ జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయ‌ణ స్వామి మాట్లాడారు. క‌ల్తీ లిక్క‌ర్, క‌ల్తీ సారా అంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు (ex cm chandrababu naidu) నాయుడు స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ పై ఆరోప‌ణలు చేయ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అన్నారు. మాజీ సీఎంకు చాలా ద‌గ్గ‌రి వ్య‌క్తి అయిన సీఎం ర‌మేష్ (cm ramesh) క‌ల్తీ సారా బిజినెస్ చేశార‌ని తీవ్రంగా ఆరోపించారు. 

టీడీపీ అధినేత రూ.550 కోట్ల మద్యం ముడుపులు తీసుకున్నార‌ని, ఈ విష‌యంలో ఏసీబీ కోర్టులో కేసు నడించింద‌ని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. మాజీ సీఎం అన్ని వ్య‌వ‌స్థలను మేనేజ్‌ చేస్తారని ఆరోపించారు. ఇటీవ‌ల కాలంలో త‌మ నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్ ఉద్దేశించి నారా లోకేశ్ అమ‌ర్యాద‌గా మాట్లాడార‌ని ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా నారా లోకేశ్ ను ఆయ‌న బూతుల‌తో వ్యాఖ్యానించారు. నారా లోకేశ్ ను ముం.... అంటూ సంబోధించారు. ‘‘ ఒరేయ్ లోకేశ్ ముం..... నీకు బుద్ది ఎప్పుడొస్తుంది.. మా సీఎం జగన్ ను వాడూ, వీడూ అంటూ దూషిస్తావా ?’’ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే స‌భ‌లో డిప్యూటీ సీఎం ఇలా మాట్లాడుతున్నా.. ఆయ‌న‌కు ఎవ‌రూ అభ్యంత‌రం చెప్ప‌లేదు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu