కరోనా కలకలం: విజయవాడలో ఒకే కుటుంబంలో నలుగురి మృతి

Published : Nov 01, 2020, 02:53 PM IST
కరోనా కలకలం: విజయవాడలో ఒకే కుటుంబంలో నలుగురి మృతి

సారాంశం

కరోనాతో విజయవాడకు చెందిన  ఓ న్యాయవాది కుటుంబంలో నలుగురు మృతి చెందారు.ఈ ఘటన  స్థానికంగా విషాదం నింపింది

విజయవాడ: కరోనాతో విజయవాడకు చెందిన  ఓ న్యాయవాది కుటుంబంలో నలుగురు మృతి చెందారు.ఈ ఘటన  స్థానికంగా విషాదం నింపింది. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని ఈ ఘటన రుజువు చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టం తప్పదని ఈ ఘటన రుజువు చేసింది.

విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది తల్లి అక్టోబర్ 8వ తేదీన మరణించింది. గత నెల 30వ తేదీన న్యాయవాది భార్య మరణించింది.

భార్య అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలోనే న్యాయవాది కూడ మరణించాడు. ఈ ముగ్గురు కూడ కరోనాతో మరణించారు. మరో వైపు కరోనాతో బాధపడుతున్న న్యాయవాది కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు మరణించాడు.ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కరోనాతో మరణించడంతో బంధు మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి.ఇటీవల కాలంలో గతంలో కంటే తగ్గుతూ వస్తున్నాయి. గతంలో రోజూ పదివేల వరకు కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో మూడు వేల కంటే తక్కువగా కేసులు నమోదయ్యాయి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!