పోలవరం ప్రాజెక్టు పనులు బాగున్నాయని గడ్కరీ అభినందించారు: చంద్రబాబు

By narsimha lodeFirst Published Nov 1, 2020, 12:43 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్టు పనులు బాగున్నాయని అప్పట్లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభినందించారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు.ఆదివారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

అమరావతి:పోలవరం ప్రాజెక్టు పనులు బాగున్నాయని అప్పట్లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభినందించారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు.ఆదివారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 

తమ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును 71 శాతం పూర్తి చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

దేశంలో ఎక్కువ నీటి లభ్యత ఉన్న నది గోదావరి అని ఆయన చెప్పారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు పోలవరంపై ప్రత్యేక శ్రద్ద పెట్టామన్నారు. ఆర్ అండ్ ఆర్ ఇస్తామని కేంద్రం గతంలోనే  చెప్పిందని ఆయన చెప్పారు. 

పోలవరం పూర్తి చేస్తే రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించొచ్చని ప్రాజెక్టుపై శ్రద్ద పెట్టామన్నారు. అధికారులంతా ఢిల్లీలోనే కూర్చొని రూ. 55, 548 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు అనుమతులు సాధించినట్టుగా చంద్రబాబు తెలిపారు.

2019లోనే  సాంకేతిక సలహా కమిటీ రూ. 55 వేల కోట్ల అంచనాలను ఆమోదించిందని చెప్పారు. 2013 భూ సేకరణ వల్ల పరిహారం, ప్యాకేజీ 70 శాతం పెరిగిందని ఆయన చెప్పారు.

2014లో తమ ప్రభుత్వ మాట మేరకు ఆర్డినెన్స్ ఇచ్చి మరీ ఏపీలో ఏడు  ముంపు మండలాలను కలిపిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పవర్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనున్నట్టుగా అప్పట్లోనే కేంద్రానికి చెప్పినట్టుగా బాబు వివరించారు.నీటి పారుదల ప్రాజెక్టు అంటేనే భూసేకరణ, పరిహారం, పునరావాం కూడ వస్తాయన్నారు.పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని నీతి ఆయోగ్ సూచించిందని చంద్రబాబు తెలిపారు.


 

click me!