ఆక్సిజన్ అందక అనంతలో నలుగురి మృతి: ప్రభుత్వం సీరియస్

Published : May 05, 2021, 09:24 AM IST
ఆక్సిజన్ అందక అనంతలో నలుగురి మృతి: ప్రభుత్వం సీరియస్

సారాంశం

అనంతపురం జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో  ఆక్సిజన్ అందక మంగళవారం రాత్రి నలుగురు రోగులు మరణించారు. ఈ ఘటనపై విచారణకు  జిల్లా కలెక్టర్ ఆదేశించారు.   

అనంతపురం: అనంతపురం జిల్లా కేంద్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో  ఆక్సిజన్ అందక మంగళవారం రాత్రి నలుగురు రోగులు మరణించారు. ఈ ఘటనపై విచారణకు  జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో  మంగళవారం నాడు రాత్రి ఏడుగంటల సమయంలో  ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు చోటు చేసుకొన్నాయని మృతుల బంధువులు ఆరోపించారు. ఈ విషయమై వైద్యులకు చెప్పినా కూడ పట్టించుకోలేదని వారు చెబుతున్నారు. దీంతో ఆక్సిజన్ అందక రోగులు  మరణించారని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

ఈ విషయం తెలిసిన వెంటనే అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి , జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆసుపత్రిని పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ ఘటనపై  ఆసుపత్రి సూపరింటెండ్ భాస్కర్ తో పాటు ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాహకుడికి నోటీసులు ఇచ్చారు కలెక్టర్.ఆక్సిజన్ సరఫరాలో అంతరాయానికి గల కారణాలపై  ప్రభుత్వం ఆరాతీస్తోంది. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను  బాధ్యులపై చర్యలు తీసుకొంటామని ప్రభుత్వం హెచ్చరించింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!