కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనం..

Published : Dec 02, 2022, 09:18 AM IST
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటలు చెలరేగడంతో నలుగురు సజీవదహనం..

సారాంశం

కాకినాడ జిల్లాలోని పత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. 

కాకినాడ జిల్లాలోని పత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వివరాలు.. జాతీయ రహదారిపై రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఇసుక లారీ అదుపు తప్పి డివైడర్‌ను దాటి మరో లారీని ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో రెండు వాహనాల క్యాబిన్‌లలో ఇరుకున్న ఇద్దరు డ్రైవర్‌లు, ఇద్దరు క్లీనర్‌లు సజీవ దహనం అయ్యారు. మంటలు పెద్దఎత్తున చెలరేగడంతో రెండు వాహనాలు కూడా దగ్దమయ్యాయి. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు  అక్కడికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేపట్టారు. ఇసుక లారీకి చెందిన డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Motivational Speech: Superman కాదు.. Hanuman గురించి చెప్పండి | Asianet News Telugu
Chandrababu, Mohan Bhagwat Attends Bharatiya Vigyan Sammelan Inaugural Session | Asianet News Telugu