బెజవాడ బంగారం చోరీ కేసులో అసలు ట్విస్ట్: గుమస్తాగా చేరి పక్కా ప్లాన్

By Siva KodatiFirst Published Jul 24, 2020, 6:06 PM IST
Highlights

రాష్ట్రంలో సంచలనం కలిగించిన విజయవాడ బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. షాపులో పనిచేసే గుమాస్తా విక్రమ్ సింగ్‌ను నిందితుడిగా గుర్తించారు

రాష్ట్రంలో సంచలనం కలిగించిన విజయవాడ బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. షాపులో పనిచేసే గుమాస్తా విక్రమ్ సింగ్‌ను నిందితుడిగా గుర్తించారు. రాజస్థాన్‌కు చెందిన అతను రెండు నెలల క్రితం షాపులో చేరినట్లుగా  పోలీసులు గుర్తించారు.

విక్రమ్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు నిందితులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణవేణి ఘాట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు.

విక్రమ్ సింగ్ కావాలనే సీన్ క్రియేట్ చేయించి దొంగతనం చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ జరిగిన షాపులో సీసీటీవీ ఫుటేజ్ నమోదయ్యే డిజిటల్ వీడియో రికార్డర్‌ను నిందితులు కాలువలో పడేశారు.

Also Read:బెజవాడలో భారీ దోపిడీ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

అంతకుముందు బెజవాడలో పట్టపగలు జరిగిన భారీ దోపిడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. వన్‌టౌన్‌లో సాయిచరణ్ జ్యూయలరీ షాపునకు చెందిన బంగారం దోపిడీకి గురైంది.

ఏడు కేజీల బంగారం, రూ.30 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. జ్యూయలరీ షాపునకు చెందిన బంగారాన్ని ఓ చోట భద్రపరిచి, ప్రతిరోజూ మళ్లీ ఉదయాన్నే తీసుకుని వెళ్తారు. శుక్రవారం కూడా కంపెనీ గుమాస్తా బంగారాన్ని తీసుకుని షాపు దగ్గరికి వచ్చాడు.

దొంగలు అతడితో పాటు, వాచ్‌మెన్‌పై బ్లేడ్లతో దాడి చేశారు. అనంతరం బంగారం, నగలు, నగదు దోచుకెళ్లారు. వెండి మాత్రం వదిలేశారు. పోలీస్ స్టేషన్‌కు వెనుక వైపే ఈ భవనం ఉంటుంది. వెంటనే బాధితులు పోలీసులకు  సమాచారం ఇచ్చారు. దుండగుల దాడిలో గాయపడిన గుమాస్తా, వాచ్‌మెన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 

click me!