సెల్‌ఫోన్ల చోరీ ముఠాలో ఇద్దరు అరెస్ట్ ,మరో నలుగురి కోసం గాలింపు:కడప ఎస్పీ

By narsimha lodeFirst Published Nov 8, 2022, 4:14 PM IST
Highlights

సెల్ ఫోన్ల ను చోరీ చేస్తున్న ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేశారు కడప పోలీసులు .ఈ గ్యాంగ్ లో మరో నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల  నుండి కోటి విలువైన ఫోన్లను సీజ్ చేశారు.

కడప:సెల్ ఫోన్ల కంటైనర్ల నుండి ఫోన్లను చోరీ చేస్తున్న ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా కడప ఎస్పీ అన్బురాజన్  చెప్పారు.మంగళవారంనాడు కడప ఎస్పీ  అన్బురాజన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను  మీడియాకు వివరించారు. గత నెల 23న హర్యానా-చెన్నై కంటైనర్ లో సెల్ ఫోన్లలో తరలిస్తున్న సమయంలో దుండగులు  సెల్ ఫోన్లను చోరీ  చేశారని ఎస్పీ చెప్పారు.సెల్ ఫోన్లను  తరలిస్తున్న లారీ కంటైనర్ డ్రైవర్  చోరీ గ్యాంగ్ తో కలిసి చోరీకి  పాల్పడినట్టుగా ఎస్పీ తెలిపారు.నిందితుల నుండి కోటి 58 లక్షల విలువైన 1397 సెల్ ఫోన్లను దుండగులు చోరీ చేశారు.ఈ కంటైనర్ నుండి ఐదు ల్యాప్ టాప్ లు,193బ్లూటూత్ లు ,రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్టుగా ఎస్పీ చెప్పారు.

గతంలో కూడ ఇదే తరహలో సెల్ ఫోన్లను  కంటైనర్  నుండి  సెల్ ఫోన్లను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు  రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ  తరహ కేసులు   నమోదయ్యాయి.గుంటూరు జిల్లాలోని మంగళగిరి వద్ద  జాతీయ రహదారిపై సెల్ ఫోన్లను తీసుకెళ్తున్న కంటైనర్ నుండి ఫోన్లను ముఠా చోచీ చేసింది.ఈ నిందితులను 13 రోజుల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు.

2020 అక్టోబర్ 4న నిందితులను అరెస్ట్ చేశారు గుంటూరు పోలీసులు.నిందితుల నుండి 81లక్షల 76లక్షల విలువైన సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తెలంగాణ రాష్ట్రంలో కూడ  సబ్బులలోడుతో వెళ్తున్న లారీలో సబ్బులు కూడ మాయం చేసిన ఘటన ఒకటి  చోటు చేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మెదక్  జిల్లాలో సబ్బుల లోడ్ ను మాయం చేసి స్థానిక దుకాణాలకు ఈ సబ్బులను చౌకగా విక్రయించారు. డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదే తరహలో చిత్తూరు జిల్లాలో కూడ సెల్ ఫోన్లను దుండగులు చోరీ చేశారు.తమిళనాడు పెరంబూరు నుండి  సెల్ ఫోన్లతో వెళ్తున్న కంటైనర్ లారీ చిత్తూరు జిల్లా నగరి సమీపంలో దుండగులు  ఆపి సెల్ ఫోన్లను దోచుకున్నారు.16వేల సెల్ ఫోన్లను దండగులు మరో లారీలో లోడ్ చేసి తీసుకెళ్లారు. ఈ ఘటన 2020  ఆగస్టు 20న ఘటన  చోటు చేసుకుంది.

click me!