పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల హయంలో అభివృద్దిపై చర్చకు సిద్దంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చెప్పారు.
అమరావతి: పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ది, వైసీపీ సర్కార్ పాలనలో అభివృద్దిపై చర్చకు సిద్దంగా ఉన్నామని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ చెప్పారు.
ఆదివారంనాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలపై తాము ప్రశ్నించినట్టుగా ఆయన చెప్పారు. ఇసుక తవ్వకాల్లో నిబంధనలు పాటించలేదని కూడా ఆయన ఆరోపించారు. అయితే ఈ విషయమై చర్చకు రావాలని ఎమ్మెల్యే శంకర్ రావు సవాల్ విసిరారని కొమ్మాలపాటి శ్రీధర్ చెప్పారు. ఎమ్మెల్యే శంకర్ రావు సవాల్ ను స్వీకరించినట్టుగా ఆయన చెప్పారు. ఈ విషయమై ఎప్పుడైనా చర్చకు తాను సిద్దంగా ఉన్నానని కొమ్మాలపాటి శ్రీధర్ స్పష్టం చేశారు. పెదకూరపాడులో టీడీపీ హయంలోనే అభివృద్ది జరిగిందన్నారు. వైసీపీ హయంలో అసలు ఎలాంటి అభివృద్ది జరగలేదని ఆయన విమర్శించారు. అమరావతిలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు. ఇసుక తవ్వకాల కారణంగా నదిలో ఏర్పడిన గోతులతో అనేక మంది మృతి చెందుతున్నారని మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ ఆరోపించారు.
undefined
also read:కొమ్మాలపాటి, నంబూరి మధ్య సవాళ్లు: అమరావతిలో టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ,టెన్షన్ (వీడియో)
పెదకూరపాడులో ఇసుక తవ్వకాలు, నియోజకవర్గంలో అభివృద్దిపై కొమ్మాలపాటి శ్రీధర్, ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు మధ్య సవాళ్లు ఆదివారంనాడు అమరావతిలో ఉద్రిక్తతకు కారణమయ్యాయి. టీడీపీ , వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్, టీడీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.