తాను టీడీపీలోనే ఉన్నానని వైసీపీలో తాను చేరలేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని ప్రచారం సాగుతున్న తరుణంలో రామసుబ్బారెడ్డి ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.
కడప: తాను టీడీపీలోనే ఉన్నానని వైసీపీలో తాను చేరలేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ప్రకటించారు. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని ప్రచారం సాగుతున్న తరుణంలో రామసుబ్బారెడ్డి ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.
Also read:బాబుకు షాక్: వైసీపీలోకి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి?
సోమవారం నాడు జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొండాపూరం, ముద్దనూరు మండలాల కార్యకర్తల తో సమావేశం కాకపోవడంపై రామసుబ్బారెడ్డి టీడీపీని వీడే అవకాశం ఉందనే ప్రచారానికి మరింత ఊతం ఇచ్చింది.
దీంతో సోమవారం నాడు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన చెప్పారు. తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన తేల్చి చెప్పారు.
పార్టీ మారే ఉద్దేశం ఉంటే తాను బహిరంగంగానే ప్రకటిస్తానన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి తాను టీడీపీలోనే ఉన్నానని ఆయన గుర్తు చేశారు. తన బాబాయ్ శివారెడ్డి కాలం నుండి తాను అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా తప్పుడు ప్రచారం చేశారని ఆయనమీడియాపై మండిపడ్డారు.