ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి మరణాన్ని కూడ వైసీపీ నేతలు రాజకీయం కోసం ఉపయోగించుకొంటున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. ఈ విషయమై వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, లక్ష్మీపార్వతిలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
గుంటూరు: ఎన్టీఆర్ కుమార్తె Umameheswari మరణాన్ని కూడ YCP నాయకులు రాజకీయం కోసం ఉపయోగించుకోవడాన్ని మాజీ మంత్రి, TDP నేత Nakka Anand Babu తప్పుబట్టారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, Vijayasai Reddy, Laxmi Parvathi లు ఉమామమేశ్వరి మరణంపై చిలవలు, పలవలు చేయడం దుర్మార్గంగా పేర్కొన్నారు. ఉమామహేశ్వరి మరణాన్ని సిగ్గుమాలిన దివాళాకోరు రాజకీయాలకు తెరలేపారన్నారు.
మానవత్వం గల మనుషులైతే ఉమా మహేశ్వరి మరణంపై సానుభూతి ప్రకటించి వదిలేయాలన్నారు. ఉమామహేశ్వరి మరణాన్ని రాజకీయానికి ఏ విధంగా వినియోగించాలని చూస్తున్నారన్నారు.విజయసాయిరెడ్డి పనిలేనివాడిలా నాలుగైదు ట్వీట్లు పెట్టారన్నారు. మూడు దశాబ్దాల నేర చరిత్ర గల కుటుంబం నుండి వచ్చిన వారు కూడా మాట్లాడటమేనా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
also read:చంద్రబాబు వచ్చాక ఉమా మహేశ్వరి లేఖ మాయం: లక్ష్మీపార్వతి సంచలనం
లక్ష్మీపార్వతి వైసీపీలో చేరి టీడీపీ, చంద్రబాబు, లోకేష్ లను విమర్శించడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్టును లక్ష్మీపార్వతి చదువుతున్నారని ఆనంద్ బాబు విమర్శించారు.. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమ నీచ సంస్కృతి మానాలని ఆయన కోరారు. దుర్మార్గపు పాలనను అంతం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.