స్వర్ణ ప్యాలెస్ ఘటనలో కుట్రదారులను బయటపెట్టాలి: దేవినేని

By narsimha lodeFirst Published Aug 18, 2020, 1:55 PM IST
Highlights

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన దుర్ఘటనలో అసలు కుట్రదారులెవరో బయటపెట్టాలని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు.

అమరావతి: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన దుర్ఘటనలో అసలు కుట్రదారులెవరో బయటపెట్టాలని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు.

మంగళవారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.కంప్యూటర్ హార్ట్ డిస్క్ మాయమైందని చెబుతున్నవారంతా దాన్ని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

కోస్తా జిల్లాల్లో  దాదాపు 32 సంవత్సరాల నుంచి 24 గంటల పాటు  ప్రజలకు సేవలు అందిస్తున్న ఆసుపత్రిగా రమేష్ పేరొందిందన్నారు.కోడికత్తి కేసులో జగన్ కు వైద్యం చేసిన హైదరాబాద్ సిటీన్యూరో ఆసుపత్రి వైద్యుడు సాంబశివారెడ్డి ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ గా ఆరోగ్య శ్రీ ఛైర్మన్ గా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

రమేశ్ బాబు ఉదంతంపై సాంబశివారెడ్డి ఇతర వైద్యులు ఎందుకు మాట్లాడరని ఆయన ప్రశ్నించారు. స్వర్ణప్యాలెస్ దుర్ఘటన చాలా దారుణమైంది. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

రమేశ్ ఆసుపత్రి ఛైర్మన్ కుటుంబాన్ని అందులో పెట్టుబడులు పెట్టిన వారిని విచారణ పేరుతో వేధిస్తున్నారన్నారు. డాక్టర్ రమేశ్ బాబుగా రాష్ట్రప్రజలందరికీ సుపరిచితమైన వ్యక్తి, ప్రభుత్వానికి రమేశ్ చౌదరిగా కనిపించాడన్నారు.

రాష్ట్ర పోలీసులు హైదరాబాద్ లోని రమేశ్ ఇంటికి వెళ్లి 86ఏళ్ల వృద్ధురాలిపై విచారణపేరుతో వీరంగం వేశారని ఆయన ఆరోపించారు. అచ్చెన్నాయుడికి వైద్యం చేశారని రమేశ్ బాబుపై ప్రభుత్వం కక్ష కట్టిందా లేక ఆయన చంద్రబాబునాయుడితో కోవిడ్ పై మాట్లాడారనా ? చెప్పాలన్నారు. 

స్వర్ణప్యాలెస్ ను క్వారంటైన్ కేంద్రంగా ప్రభుత్వమే నిర్వహించినప్పుడు అందులో ఫైర్, ఇతరరేతర వసతులున్నాయో లేదో తెలియదా అని ఆయన ప్రశ్నించారు.
అనుమతులిచ్చిన యంత్రాంగాన్ని హోటల్ తో ఒప్పందం చేసుకున్న వారిని ఎందుకు విచారించలేదో చెప్పాల్సిందిగా కోరారు.

స్వర్ణప్యాలెస్ లో ఘటన జరిగినప్పుడు లోపల ఎవరున్నారు, ఎవరు వచ్చి వెళ్లారనే వివరాలు బయటపెట్టాలన్నారు.మంటలు ఎగబాకేవరకు అగ్నిమాపక సిబ్బంది ఎందుకు ఘటనాస్థలానికి రాలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఈ విషయమై సినీ నటుడు రామ్ ట్వీట్ పెడితే పోలీసులు అతన్ని బెదిరించడమేటన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు వెళుతుంటే  ప్రభుత్వం ఇక్కడున్న ఆసుపత్రుల్నికక్షసాధింపుచర్యలతో మూసేయిస్తోందన్ి ఆయన ఆరోపించారు.

కరోనా వైరస్ కన్నా కులవైరస్ అనే పెద్ద జబ్బు రాష్ట్రంలో నడుస్తోందన్న నటుల వ్యాఖ్యలు వాస్తవమని ఆయన అభిప్రాయపడ్డారు. పక్కరాష్ట్రాలు వైద్యులపై పూలు చల్లి గౌరవిస్తుంటే, రాష్ట్రంలో మాత్రం వైద్యులకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

విశాఖపట్నంలో స్టేట్ గెస్ట్ హౌస్ కి శంకుస్థాపన చేశారనే వార్తలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి వరద ప్రాంతాల్లోని నిర్వాసితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.

ఆర్థికశాఖలో జరిగిన రూ.649కోట్ల డబుల్ పేమెంట్స్ తో పాటు కాంట్రాక్టర్లకు ఇతరులకు జరిగిన చెల్లింపులపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. 
ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన బంధువు రమణారెడ్డి ఆర్థికశాఖాధికారులు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. 

రాజీనామా చేయాల్సివస్తుందన్న భయంతోనే బుగ్గన సీఎఫ్ ఎంఎస్ కుంభకోణంపై మాట్లాడటం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రాజెక్ట్ కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ లో రిజర్వేషన్లు, ఎక్సెస్ ల సంగతి గురించి ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. 

వేలకోట్లకు చెందిన సాగునీటి ప్రాజెక్టుల టెండర్లను ఎవరికి అప్పగించి ఎంత దోచిపెట్టిందో తెలపాలన్నారు. 62 ప్రాజెక్టులను చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించి, 23 పూర్తిచేసిన విషయాన్ని ఆయన  ప్రస్తావించారు. 

click me!