ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చేసిన వ్యాఖ్యలకు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి కౌంటరిచ్చారు.
అమరావతి: బీజేపీ ఏపీ శాఖలో మరో వివాదం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పథకాలకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లేనా అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలకు మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు.
గుంటూరులో కాపు సామాజిక వర్గం నేతలు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా పేరును ఒక జిల్లాకు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, వైఎస్ ఆర్ పేర్లను మాత్రమే ఉపయోగించడాన్ని ఆయన తప్పు బట్టారు. టీడీపీ అధికారంలో ఉంటే ఎన్టీఆర్ , వైసీపీ అధికారంలో ఉంటే వైఎస్ఆర్ పేరు పెడుతున్నారని జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు.
"అన్నీ ఇద్దరి పేర్లేనా"
ఒకరు తెలుగు జాతికి గుర్తింపుని తీసుకొని వచ్చి, పేదలకు నిజమైన సంక్షేమం-- 2 రూపాయలకే కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివీ ప్రజలకు అందిస్తే , మరో కరు ఫీజు రీయింబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్సు సేవలు,ఆరోగ్యశ్రీ అందించారు pic.twitter.com/bFPSbCBKV1
undefined
ఈ వ్యాఖ్యలపై ఇవాళ దగ్గుబాటి పురందేశ్వరి స్పదించారు. నిన్న జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చారని పురంధేశ్వరి చెప్పారు. రూ. 2 కిలో బియ్యం, పక్కా గృహలు ,జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివి తీసుకువచ్చారని పురంధేశ్వరి గుర్తు చేశారు.
ఫీజు రీ ఎంబర్స్ మెంట్, 108 సేవలు , ఆరోగ్య శ్రీ వంటి సేవలను వైఎస్ ఆర్ అందించారని పురంధేశ్వరి చెప్పారు. నిన్న జీవీఎల్ నరసింహరావు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ని కూడా పురంధేశ్వరి షేర్ చేశారు.
కొంతకాలంగా కాపు సామాజికవర్గానికి చెందిన అంశాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు స్పందిస్తున్నారు. వంగవీటి రంగా పేరును ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. కాపుల రిజర్వేషన్ల విషయమై రాష్ట్ర ప్రభుత్వం తీరుపై జీవీఎల్ విమర్శలు చేశారు. ఏం చేశారని కాపులు జీవీఎల్ నరసింహరావుకి సన్మానాలు చేస్తున్నారని బీజేపీకి నిన్న రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు.