మోడీ ఆదేశాల మేరకే, విచారణ చేసుకోవచ్చు: ఈఎస్ఐ కుంభకోణంపై అచ్చెన్నాయుడు

By narsimha lode  |  First Published Feb 21, 2020, 1:49 PM IST

ఏపీ రాష్ట్రంలోని ఈఎస్ఐ కుంభకోణంపై విజిలెన్స్ నివేదికపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం నాడు స్పందించారు.



శ్రీకాకుళం: ఈఎస్ఐ కుంభకోణంలో తన పాత్ర ఉందని ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు  స్పష్టం చేశారు. ఈ విషయమై విచారణ చేసుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు.

ఏపీ రాష్ట్రంలో ఈఎస్ఐలో కుంభకోణం చోటు చేసుకొందని విజిలెన్స్ ఎన్‌పోర్స్‌మెంట్ నివేదిక బయటపెట్టింది. ఈ నివేదికలో  మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరును కూడ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ  తేల్చింది.

Latest Videos

ఈ నివేదికలో  పేర్కొన్న అంశాలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం నాడు స్పందించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అచ్చెన్నాయుడు మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.

Also read:ఏపీ ఈఎస్ఐలో భారీ స్కాం: తెర మీదికి అచ్చెన్నాయుడు పేరు

 ప్రధాని నరేంద్ర మోడీ  ఆదేశాల మేరకు ఆనాడు తాను వ్యవహరిచినట్టుగా అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోడీ అన్ని రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులతో ఏర్పాటు చేశారని ఆ సమయంలో  టెలీ హెల్త్ సర్వీసెస్ ను నిరంతరాయంగా పనిచేయాలని సూచించారని చెప్పారు.

2016లో కేంద్రం నుండి  అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఓ లేఖ వచ్చిందని అచ్చెన్నాయుడు గుర్తు చేసుకొన్నారు. ఈ విషయమై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కేంద్రం నుండి వచ్చిన లేఖ విషయమై ఈ సమావేశంలో చర్చించామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టుగా అధికారులు తన దృష్టికి తీసుకొచ్చారని  అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారో ఏపీలో కూడ ఇదే విధానాన్ని అమలు చేయాలని  తాను ఆ లేఖలో కోరినట్టుగా ఆయన గుర్తు చేశారు.  తాను ఏనాడూ కూడ నామినేషన్ పద్దతిలో  ఇవ్వాలని కోరలేదన్నారు.

Also read:ఏపీ ఈఎస్ఐలో భారీ స్కాం: తెర మీదికి అచ్చెన్నాయుడు పేరు

తాను మంత్రిగా ఉన్న కాలంలో ప్రతి కొనుగోలులో టెండర్ల ద్వారా కొనుగోలు చేయాలని మాత్రమే ఆదేశాలు జారీచేసినట్టుగా అచ్చెన్నాయుడు చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

మందులు, ఇతర పరికరాల కొనుగోలును నామినేషన్ పద్దతిలో ఇవ్వాలని తాను సిఫారసు చేసినట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు.

తాను కానీ తన కుటుంబం కానీ అవినీతికి దూరంగా ఉంటామన్నారు.  తనకు డబ్బులు అవసరమైతే తెలిసిన వారి వద్ద తీసుకొంటానని అవినీతికి పాల్పడనని అచ్చెన్నాయుడు తెలిపారు.

తాను మంత్రిగా ఉన్న కాలంలో జారీ చేసిన ప్రతి ఫైలుకు సంబంధించిన కాగితాలు తన వద్ద ఉన్నాయని అచ్చెన్నాయుడు చెప్పారు. ఈఎస్ఐ కుంభకోణానికి సంబంధించి విచారణ చేసుకోవచ్చని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.

 

 
 

click me!