రిటైర్మెంట్ రోజునే వైద్యాధికారి నిర్ణయం:విజయవాడలో 13 కోవిడ్ సెంటర్ల లైసెన్సుల రద్దు

By narsimha lodeFirst Published Sep 4, 2020, 2:01 PM IST
Highlights

విజయవాడలో 13 కోవిడ్ సెంటర్ల లైసెన్సులను రిటైరైన జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ రమేష్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్మెంట్ రోజునే 13 కోవిడ్ సెంటర్లను రద్దు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 

విజయవాడ: విజయవాడలో 13 కోవిడ్ సెంటర్ల లైసెన్సులను రిటైరైన జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ రమేష్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్మెంట్ రోజునే 13 కోవిడ్ సెంటర్లను రద్దు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

విజయవాడలోని స్వర్ణప్యాలెస్  కోవిడ్ సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో 10 మంది మరణించారు. ఈ ఘటన ఆగష్టు 10వ  తేదీన చోటు చేసుకొంది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటి విచారణలో కొన్ని విషయాలు వెలుగు చూశాయి.

సరైన వసతులు లేకున్నా కోవిడ్ సెంటర్ల అనుమతి ఇచ్చిన విషయం వెలుగు చూసింది. కోవిడ్ సెంటర్లకు అనుమతులు ఇచ్చిన విషయంలో నిబందనలను ఉల్లంఘించారనే ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ సెంటర్లలో సౌకర్యాలు లేని కారణంగా ఇప్పటికే 9 కోవిడ్ సెంటర్లను ప్రభుత్వం రద్దు చేసింది.

also read:అధిక ఫీజులు: విజయవాడలో 5 ప్రైవేట్ కోవిడ్ సెంటర్ల అనుమతులు రద్దు

మరో 13 కోవిడ్ సెంటర్ల అనుమతులను కృష్ణా జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ రమేష్ రద్దు చేశారు. నాలుగు రోజుల క్రితం డాక్టర్ రమేష్ ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ చేసిన రోజునే డాక్టర్ రమేష్ ఈ కోవిడ్ సెంటర్ల అనుమతులను రద్దు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కోవిడ్ సెంటర్లకు అనుమతి ఇవ్వడంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉద్యోగ విరమణ చేసిన రోజునే డాక్టర్ రమేష్ కోవిడ్ సెంటర్లను ఎందుకు రద్దు చేశారనే చర్చ సాగుతోంది.

click me!