దేవాలయాల్లో పనిచేస్తున్న ధార్మిక సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి: ఐవైఆర్

First Published Jun 19, 2018, 11:45 AM IST
Highlights

ఏపీ ప్రభుత్వంపై ఐవైఆర్ విమర్శలు 


అమరావతి:  క్షురకుల న్యాయబద్దమైన  సమస్యల పరిష్కారం కోసం  రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా  రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.


దేవాలయాల్లో పనిచేస్తున్న ధార్మిక సిబ్బందికి  రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతోందని  ఐవైఆర్ ఆరోపించారు.  క్షురకులు, అర్చకులు ధార్మిక సిబ్బంది కిందకి వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.  క్షురకులకు స్కేల్ ఆఫ్ పే ఇవ్వడం సాధ్యం కాకపోతే  వారి న్యాయమైన కోర్కెలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

 

పరోక్ష ఎన్నికల లో ఈ చిన్న కులాల వారికి ప్రాతినిథ్యంకలిగించే విధానం ఉంటే వారి సమస్యలను సమర్థవంతంగా వినిపించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది

— IYRKRao , Retd IAS (@IYRKRao)

 

పరోక్ష ఎన్నికల్లో ఈ చిన్నకులాలకు ప్రాతినిథ్యం కల్పించే విధానం ఉంటే  వారి సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించుకొనే అవకాశం నెలకొనేదని ఆయన అభిప్రాయపడ్డారు. 

అయితే  నాయిబ్రహ్మణ సేవా సంఘం నాయకులు జూన్  18వ తేది రాత్రి  అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో  సమావేశమై  సమ్మె విరమిస్తున్నట్టు గా ప్రకటించారు. ప్రస్తుతం క్షురకులు  సమ్మె విధుల్లో చేరారు. 

click me!