శ్రీశైలంలో భయంభయం...మొన్న పులి, ఎలుగుబంటి, కొండచిలువ, నేడు అడవిపందులు

By Arun Kumar PFirst Published Jul 25, 2020, 12:53 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అడవి పందుల స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అడవి పందుల స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ అడవి పందుల శ్రీగిరి ప్రధాన రహదారులపై యదేచ్చగా తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.    

శుక్రవారం రాత్రి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వాహక పరిపాలన భవనానికి సమీపంలోని ఉన్న రహదారిపై దుకాణాల వద్దకు గుంపులు గుంపులుగా వచ్చిన అడవిపందులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురి చేశాయి. రోడ్డుపై ఉన్న దుకాణాలపై దాడి చేసి దొరికిన ఆహారాన్ని తినేందుకు అడవి పందులు పోటీపడ్డాయి. 

కరోనా లాక్ డౌన్ కారణంగా శ్రీశైల దేవస్థానంలో భక్తులకు దర్శనాలను నిలిపోయివేశారు. దీంతో అన్నదాన సత్రాలు కూడా మూసివేయడంతో భోజన పదార్ధాలు లేకపోవడం వాటి వ్యర్థాలు క్షేత్ర బయట వేసే క్రమంలో వాటిని తినేందుకు వచ్చే వన్యమృగాలు, అడవి పందులు ఇప్పుడు క్షేత్రం లోపలకి ఆహారం కోసం వచ్చి  స్వైర విహారాలు చేస్తున్నాయి. మొన్న పులి, ఎలుగుబంటి, కొండచిలువ, నేడు అడవిపందులు వంటి అడవి జంతువులు క్షేత్రం లోపలకి వస్తున్నాయి. 

read more    తిరుమలకు కరోనా దెబ్బ: సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత

అటవీశాఖ అధికారులు సైతం ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. శ్రీశైల క్షేత్రానికి అటవీ ప్రాంతం దగ్గరగా ఉండడంతో అడవిలో కొన్ని వన్యమృగాలు పాములు క్షేత్రం లోపలికి వచ్చి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే ఇంత వరకూ వాటివల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. 

ఏదేమైనా రాత్రి వేళల్లో కూడా అటవీశాఖ అధికారులు వాటిని లోపలికి రానివ్వకుండా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.  లాక్ డౌన్ కారణంగా తమ దుకాణాలను కాపాడవలసిన బాధ్యత తీసుకోవాలన స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు. 
 

click me!