ఆత్మహత్యలకు ప్రేరేపించేలా లోకేష్ జూమ్ మీటింగ్: కొడాలి నాని ఫైర్

By narsimha lode  |  First Published Jun 9, 2022, 3:56 PM IST

టెన్త్ ఫెయిలైన విద్యార్ధులను ఆత్మహత్యలకు ప్రేరేపించేందుకు టీడీపీ నేత లోకేష్ జూమ్ మీటింగ్ లు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.



విజయవాడ:  టెన్త్ ఫెయిలైన విద్యార్ధులను ఆత్మహత్యలకు ప్రేరేపించేందుకు TDP  నేత Nara Lokesh లోకేష్ జూమ్ మీటింగ్ లు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి Kodali Nani ఆరోపించారు.

Tenth Class  క్లాస్ విద్యార్ధులతో లోకేష్ ఇవాళ Zoom  మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే Vallabhaneni Vamsi , YCP  నేత దేవేందర్ రెడ్డిలు హాజరయ్యారు.  ఈ విషయమై మాజీ మంత్రి కొడాలి నాని  గురువారం నాడు విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

Latest Videos

undefined

పిల్లలతో చిల్లర రాజకీయాలు మానుకోవాలని లోకేష్ ను కోరారు.  ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకొనేందుకు టీడీపీ ముందుంటుందని ఆయన విమర్శించారు. జూమ్ మీటింగ్ పెట్టి లోకేష్ విద్యార్ధులను ఏం చేయాలనుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టెన్త్ క్లాస్ ఫెయిలైన విద్యార్ధులు ఎందుకు పనికిరారని చెప్పేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారన్నారు. గత ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంలో స్కూల్స్ ప్రారంభిస్తే  స్కూళ్లను మూసివేయాలని  టీడీపీ, జనసేన డిమాండ్ చేసిందన్నారు. 

ఆన్ లైన్ లో విద్యార్ధులు చదువుకోవడం ద్వారా విద్యార్ధులు ఇబ్బందులు పడ్డారన్నారు. రాజకీయ అవసరాల కోసం విద్యార్ధులను బలి చేయవద్దని కొడాలి నాని హితవు పలికారు. లోకేష్ ను అడ్డుకొనేందుకు గాను తాను జూమ్ మీటింగ్ లోకి ఎంటరయ్యాయన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో  టెన్త్ క్లాస్ విద్యార్ధులు ఎవరూ కూడా ఫెయిల్ కాలేదా అని ఆయన ప్రశ్నించారు. 

also read:రాజకీయ ప్రేరేపిత ఉపన్యాసాలతో పిల్లలను చెడగొట్టొద్దు: లోకేష్‌కి వల్లభనేని వంశీ సూచన

మా మేనల్లుడు యాప్ లింక్ ద్వారా  తాను జాయిన్ అయ్యాయన్నారు. తనను చూడగానే జూమ్ కనెక్షన్ ఎందుకు కట్ చేశారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన వర్షన్ ను ఎందుకు వినలేదని ఆయన అడిగారు. లోకేష్ ఏమైనా పులా, సింహాం. డైరెక్టుగా చర్చలకు వెళ్లకపోవడానికి  ఆయన అడిగారు. టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన విద్యార్ధులు 8, 9 విద్యార్థులు ఆన్ లైన్ లో నే చదివారన్నారు.  విద్యార్థులు నెల రోజుల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధిస్తే  సప్లిమెంటరీ పరీక్షల్లో కాకుండా డైరెక్టు పరీక్షల్లో పాసైనట్టుగా సర్టిఫికెట్లు ఇస్తామని ప్రభుత్వం  హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు, లోకేష్, పన్ కళ్యాణ్ మాటలను విద్యార్ధులు, వారి తల్లిదండ్రులను పట్టించుకోవద్దని ఆయన కోరారు. 
 

click me!