
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్షంగా పోటీ చేసినా కనీసం ఒక్క సీటు కూడా రాదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తాను క్షేత్ర స్థాయిలో పరిస్థితులను గమనించానని.. ఆ తర్వాతే పవన్ గెలవరని చెబుతున్నట్లు కేశినేని నాని పేర్కొనడం గమనార్హం.
పవన్ కల్యాణ్‌ను తను దగ్గర నుంచి గమనించినట్లు చెప్పారు. పవన్ కి స్థిరత్వం ఉండదని, ఒక మాట మీద నిలబడలేరని నాని ఆరోపించారు. చిరంజీవితో పోల్చి చూసినప్పుడు పవన్ కల్యాణ్ చిన్నబోతారని.. పవన్ కల్యాణ్ తో పోలిస్తే చిరంజీవి అనేక రెట్లు శక్తిమంతుడు అని, పవన్ కల్యాణ్ కన్నా చిరంజీవికి క్రేజ్ కూడా చాలా ఎక్కువ అని నాని అన్నారు.
ప్రజారాజ్యం పార్టీ అనేది చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు కలిసి ఏర్పాటు చేసిన వ్యవస్థ అని.. దానికే 18 సీట్లు వచ్చాయని, చిరంజీవి స్వయంగా పోటీ చేసి ఓడిపోయారని.. పవన్ కల్యాణ్‌కూ అదే అనుభవం అని తప్పదని నాని వ్యాఖ్యానించారు.