గుంటూరులో విషాదం: 20 రోజుల్లోనే కరోనాతో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

Published : May 11, 2021, 05:07 PM IST
గుంటూరులో విషాదం: 20 రోజుల్లోనే కరోనాతో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

సారాంశం

కరోనాతో గుంటూరులో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించారు. 20 రోజుల వ్యవధిలో ఐదుగరు మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. 

గుంటూరు: కరోనాతో గుంటూరులో ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించారు. 20 రోజుల వ్యవధిలో ఐదుగరు మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. గుంటూరు పట్టణానికి చెందిన మహ్మద్ ఫరుదుద్దీన్ షా టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఏటీ ఆగ్రహరంలోని శ్రీరామ్‌నగర్ లో ఆయన నివాసం ఉండేవాడు.  పరుదుద్దీన్ కు ఓ కూతురు, ఇద్దరు కొడుకులున్నారు. వారికి పెళ్లిళ్లు కూడ చేశారు. 

గత నెల 4 వ తేదీన ఫరుదుద్దీన్ కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడ  వరుసగా ఈ వైరస్ బారినపడ్డారు. ఏప్రిల్ 4 నుండి 29వ తేదీ వరకు పరుదుద్దీన్ తో పాటు ఆయన కూతురు, తల్లి, కొడుకు భార్య కరోనా సోకి మరణించారు. కరోనాతో మరణించిన విషయం మరొకరికి తెలియదు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సమయంలో వీరంతా మరణించారు. ఒకరి తర్వాత మరొకరు చనిపోవడం  ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కరోనా బారినపడిన తమ వారిని రక్షించుకొనేందుకు ఆ కుటుంబం రూ. 20 లక్షలు అప్పులు చేసింది. అయినా కూడ ఐదుగురు ప్రాణాలతో లేకుండాపోయారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!