నెల్లూరు జిల్లాలో ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన పాల వ్యాన్: ఐదుగురు దుర్మరణం

By telugu team  |  First Published Mar 23, 2021, 8:48 AM IST

నెల్లూరు జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను వేగంగా దూసుకొచ్చిన పాల వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.


నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో మంగళవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డారు నెల్లూరు జిల్లాలోని సంగం మండలం దువ్వూర వద్ద ఈ ప్రమాదం సంభవించింది. 

నెల్లూరు - ముంబై జాతీయ రహదారిపై పక్కన ఆగి ఉన్న ఆటోను పాల వ్యాన్ వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. దీంతో దువ్వూరు గ్రామానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మరణించారు మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు. మృతులను దువ్వూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన కె. బాబు (55), టీ రమణయ్య (60), కె. మాలకొండయ్య (50), జి శీనయ్య (50), ఎం. శీనయ్యలుగా గుర్తించారు. 

Latest Videos

undefined

కొడవలూరు మండలం రాజుపాలెం చెరువుల్లో చేపలు పట్టడానికి వెళ్తూ 14 మంది ఆటో ఎక్కబోతుండగా వెనక నుంచి వచ్చిన వ్యాను ఢీకొట్టింది. ఐదుగురు మరణించడంతో పాటు వ్యాన్ డ్రైవర్ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

గాయపడినవారిని బుచ్చిరెడ్డిపాలెం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

click me!